Dhurandhar 2 Movie: దురంధర్ అద్భుతం . . అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ
Dhurandhar 2 Movie: దురంధర్ 2 మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Dhurandhar 2 Movie
Dhurandhar 2 Movie: ప్రస్తుతం దేశమంతా దురంధర్ 2 మేనియాతో ఊగిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. సెన్సార్ ఇబ్బందులతో స్థానిక భాషల్లో విడుదల కాకపోయినా.. హిందీ వెర్షన్ థియేటర్లలో ఒక ఊపు ఊపేస్తోంది. దురంధర్ మొదటి పార్ట్ కంటే కూడా ఇది మరింత అదిరిపోయిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అలాగే, సినిమా సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులు పిచ్చెక్కిపోయేలా సీన్స్ ఉన్నాయట. సోషల్ మీడియా అంతా దురంధర్ 2 మూవీ గురించే చర్చ నడుస్తోంది.
సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులే దురంధర్ 2 మూవీని ఆకాశానికి ఎత్తేస్తుంటే.. మరోవైపు సెలబ్రిటీలు దురంధర్ మూవీపై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ప్రత్యేకంగా వేసిన ప్రీమియర్ షో చూసిన ఆర్జీవీ దురంధర్ 2 షోలే కంటే వందరెట్లు అద్భుతంగా ఉందంటూ భారీ హైప్ ఇచ్చారు. డిటైల్ రివ్యూ ఇచ్చి మూవీపై విపరీతమైన ఆసక్తిని కలిగించారు.
ఆర్జీవీ చెప్పినట్లే థియేటర్లలో ప్రేక్షకులు ప్రతి సీన్ కి కనెక్ట్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే, సాధారణంగా సినిమాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఎప్పుడో కానీ వ్యక్తపరచని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దురంధర్ చూసి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన X హ్యడిల్లో మూవీ అదిరిపోయిందని చెప్పారు.
“ఇప్పుడే దురంధర్2 దేశభక్తి మూవీ చోశాను. ప్రతి దేశభక్తుడికి ఈ మూవీ గర్వకారణంగా నిలుస్తుంది. మూవీలో ఎన్నో చప్పట్లు కొట్టించే సీన్స్ ఉన్నాయి.” అని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు సినిమాలోని నటీనటులందరూ చాలా బాగా చేశారని చెప్పిన ఆయన ముఖ్యంగా మాధవన్ నటనకు ప్రశంసలు కురిపించారు. ఇక టెక్నీకల్ టీమ్ అందరూ అద్భుతమే చేశారని అల్లు అర్జున్ అన్నారు.
ఇక రణవీర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన బన్నీ ఇలాంటి ప్రతిభావంతుడైన నటుడు మన దేశంలో ఉండడం గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. అలాగే సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ లాంటి దర్శకుడు మన దేశంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. చివరగా ఆయన మూవీకి సూపర్ క్యాప్షన్ ఇచ్చారు.
“ఒక భారతీయ కథ... అంతర్జాతీయ స్టైల్! జై హింద్” అనేదే ఆ క్యాప్షన్. అదిరింది కదూ.
మొత్తంగా దురంధర్ సీక్వెల్ సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకర్షిస్తోంది. అందరితోనూ మాట్లాడిస్తోంది. దేశభక్తి సినిమాల్లో ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదని చాలామంది అంటున్నారు.
మొదటి పార్ట్ వచ్చిన మూడునెలలకే..
డిసెంబర్ 5న విడుదలై విజయం సాధించిన 'ధురందర్' సినిమా విడుదలైన కేవలం మూడు నెలలకే 'ధురందర్ 2' విడుదలైంది. ఇది ఒకరకంగా రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులు కూడా ఇంకా దురంధర్ మూవీ చేసిన మేజిక్ మర్చిపోలేదు.ఆ మూవీ విశేషాలు తాజాగానే ఉండడంతో దురంధర్ 2 అందరికీ వేగంగా కనెక్ట్ అయిపోయింది. మన దేశంలో మూడుగంటలు దాటిన నిడివి ఉన్న సినిమాలు చాలా తక్కువ. పైగా అంత నిడివి ఉన్న మూవీస్ సక్సెస్ రేటు కూడా తక్కువే. కానీ, దురంధర్ చరిత్రను మార్చేసింది. 3 గంటల 49 నిమిషాల నిడివితో ఈ మూవీ వచ్చింది. అంటే దాదాపు 4 గంటలు. అంతసేపు థియేటర్లో ప్రేక్షకుడిని కూచోపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఆదిత్య ధర్.