అభిమానుల సందర్శనకు బాలు పార్థివదేహం!

Last Tribute To SP Balasubrahmanyam : గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కొద్దిసేపటి క్రితేమే మరణించారు.. ఆయన మరణవార్తను అయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

Update: 2020-09-25 09:34 GMT

sp balasubrahmanyam

Last Tribute To SP Balasubrahmanyam : గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కొద్దిసేపటి క్రితేమే మరణించారు.. ఆయన మరణవార్తను అయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. కరోనాతో బాలు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్‌కి అందించిన ఎస్పీ చరణ్.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎస్పీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. " నాన్నగారు ఇవాళ (సెప్టెంబర్ 25- శుక్రవారం) స్వర్గీయులయ్యారు. ఆయన కోసం ప్రార్థన చేసిన అందరికీ.. ఎంజీఎం డాక్టర్లకు, స్టాఫ్‌కి కృత‌జ్ఞతలు తెలుపుతున్నాం. నాన్న గారు లేకపోయినా ఆయన పాట ఎప్పుడూ మీతోనే ఉంటుంది.. ఆ పాటే పలకరిస్తుంది. ఆయన మరణించలేదు మీతో మాతో ఆయను ఎప్పుడూ ఉంటారు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఎస్పీ చరణ్.

అయితే అయన పార్ధివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం కోసం చెన్నైలోని సత్యం థియేటర్‌ వద్ద ఉంచనున్నారు. ఇప్పటికే సత్యం థియేటర్ పార్కింగ్ ప్లేస్‌లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి అభిమానులను ఎస్పీ బీ పార్థివదేహం సందర్శనకు అనుమతించనున్నారు. ఇక అయన అంత్యక్రియలు ఫామ్ హౌస్‌లో నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు అయన మరణవార్త వినగానే ఎస్పీ బాలు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు షాక్ కి గురవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అయనకి సంతాపం తెలుపుతున్నారు.

Tags:    

Similar News