Rashmika Mandanna: పుష్ప 2, యానిమల్ తర్వాత రష్మిక ఫేట్ డౌటేనా?

Rashmika Mandanna: రష్మికా మందన్నా టాలీవుడ్ కి బ్రేక్ ఇస్తుందా?

Update: 2023-04-06 14:30 GMT

Rashmika Mandanna: పుష్ప 2, యానిమల్ తర్వాత రష్మిక ఫేట్ డౌటేనా?

Rashmika Mandanna: రష్మికా మందన్నా టాలీవుడ్ కి బ్రేక్ ఇస్తుందా? గుడ్ బై చెబుతుందా ? ఇంకా తేలలేదు కాని. కలిసొస్తున్న టైంలో కూడా తను కోలీవుడ్ లో జెండా ఎగరేయాలనుకుంటోందట. 2024 లో కంప్లీంట్ గా అటే షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందట.. ఎందుకలా నిర్ణయించుకుంటోంది?

పుష్ప 2 తర్వాత రష్మిక ఏం చేయబోతోందనే ప్రశ్నకు, ఆన్సర్ జంప్ టు కోలీవుడ్ అంటున్నారు. ఆగస్ట్ 11న తన బాలీవుడ్ మూవీ యానిమల్ రిలీజ్ అవుతోంది. పుష్ప వచ్చే ఏడాది రానుంది. ఆ తర్వాత రష్మిక అడ్రస్ చెన్నై అనంటున్నారు. తెలుగులో మహేశ్ నుంచి బన్నీ వరకు పెద్ద హీరోలతో జోడీకట్టిన రష్మిక, ఇంకా పవన్ నుంచి చెర్రీ వరకు, తారక్ నుంచి ప్రభాస్ వరకు జోడీ కట్టలేకపోయింది. సో ఇంకా తనకి ఇక్కడ స్కోప్ ఉన్న ఛలో కోలీవుడ్ అనటానికి ప్రాపర్ రీజన్ ఉందట.

తెలుగు హీరోలంతా బాలీవుడ్ హీరోయిన్లతో జోడీ ప్లాన్ చేస్తున్నారు. నార్త్ మార్కెట్ కోసం ఇది తప్పట్లేదట. అంతమాత్రానా రష్మికకు ఇక్కడ ఛాన్స్ లు రావా అంటే, చెప్పలేం అంటున్నారు. అందుకే అంది వచ్చిన అరవ ఆఫర్లకు నో చెప్పట్లేదట రష్మిక. తమిళ్ లో వారసుడు, సుల్తాన్ రెండు సినిమాలూ రష్మికకు పంచ్ పడేలా చేశాయి. సో అక్కడ ఛాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కట్ చేస్తే పుష్ప 2, నితిన్ మూవీ తర్వాత ఇక్కడ రష్మకకు ఛాన్సుల వర్షం ఉండకపోవచ్చంటున్నారు. అందుకే రష్మిక ముందే సర్దుకుంటుందనే ప్రచారం షురూ అయ్యింది.

పుష్ప 2 తర్వాత రష్మికకు క్రేజ్ పెరిగొచ్చు. కాని తెలుగు హీరోలంతా కొత్త ముఖాలకోసం ఎదురుచూడటంతో, రష్మిక ఇక్కడ పాత లేడీగా మారిందనే కామెంట్లు పేలుతున్నాయి. ఏదేమైనా 6 అరవ సినిమాలకు సై అనటంతో, రష్మిక ఎటు వైపు మొగ్గుచూపుతోందో తేలింది. 

Tags:    

Similar News