The Paradise: రూ.200 కోట్లా..? నానిపై వర్క్ అవుట్ అయ్యేనా..?
The Paradise: ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పుడు పాన్-ఇండియా రేంజ్‌ను దాటి గ్లోబల్ మార్కెట్‌పై కన్నేశారు.
The Paradise: రూ.200 కోట్లా..? నానిపై వర్క్ అవుట్ అయ్యేనా..?
The Paradise: ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని, ఇప్పుడు పాన్-ఇండియా రేంజ్‌ను దాటి గ్లోబల్ మార్కెట్‌పై కన్నేశారు. ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మళ్ళీ చేతులు కలపడం, అది కూడా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. టాలీవుడ్ లెక్కలన్నీ మారిపోయే సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాని సినిమాపై 200 కోట్లు పెట్టడం సాహసమే అయినా, మేకర్స్ నమ్మకం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.షూటింగ్ పూర్తి కాకముందే నెట్‌ఫ్లిక్స్ రూ. 75 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకోవడం నాని మార్కెట్ స్టామినాను నిరూపిస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం, ఆడియో రైట్స్ రూపంలోనే భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వంటి విదేశీ భాషల్లో మొత్తం 8 లాంగ్వేజెస్‌లో రిలీజ్ ప్లాన్ చేయడం ఒక మాస్టర్ స్ట్రోక్.
1990ల కాలం నాటి సికింద్రాబాద్ గల్లీల నేపథ్యంలో సాగే ఈ కథలో నాని జడల్ అనే ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా సెట్టింగ్స్ మరియు మేకింగ్ క్వాలిటీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోందని, అందుకే నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారని సమాచారం."
ఈ సినిమాలో మరో హైలైట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండటం. అలాగే రాఘవ జుయల్, కయాదు లోహర్ వంటి నటీనటుల చేరికతో ఈ సినిమాకు నేషనల్ అప్పీల్ పెరిగింది. ప్రస్తుతానికి మార్చి 26 విడుదల తేదీగా ఉన్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ మరియు క్వాలిటీ విషయంలో శ్రీకాంత్ ఓదెల తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల విడుదల కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కానీ 'లేటుగా వచ్చినా.. లేటెస్టుగా' రావడం నాని స్టైల్ కాబట్టి ఫ్యాన్స్ వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ‘ది ప్యారడైజ్’ నిజంగానే బాక్సాఫీస్ వద్ద స్వర్గాన్ని చూపిస్తుందా? లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, నాని తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేస్తున్న ఈ అతిపెద్ద ప్రయత్నం తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయం.