Mana Shankara Varaprasad Garu: చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: ఓటీటీలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Mana Shankara Varaprasad Garu: సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించారు.

Update: 2026-02-03 06:17 GMT

Mana Shankara Varaprasad Garu: సంక్రాంతి బరిలో దిగిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రాంతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి మెగాస్టార్ స్టామినాను మరోసారి నిరూపించింది.

మూడు వారాలైనా తగ్గని జోరు

జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, థియేటర్ల వద్ద సందడి తగ్గకపోవడం విశేషం. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించగా, విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించారు.

ఓటీటీ డేట్ లాక్?

థియేటర్లలో కాసుల వేట కొనసాగిస్తున్న ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (ZEE5) భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ సినిమాలో క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఇన్ని రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News