OTT Movie : హిలేరియస్ బ్లాక్ బస్టర్..20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి మూవీ

హిలేరియస్ బ్లాక్ బస్టర్..20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి మూవీ

Update: 2026-02-04 01:29 GMT

OTT Movie : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ సంక్రాంతి రేసులో నారీ నారీ నడుమ మురారి సినిమాతో గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించారు. సామజవరగమన వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో, మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 14న విడుదలైన ఈ సినిమా, సంక్రాంతి సీజన్‌లో పెద్ద పెద్ద హీరోల సినిమాలు ( రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు) పోటీలో ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా, శర్వానంద్ కెరీర్‌లో మరో మంచి హిట్‌గా నిలిచింది.

ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 04 (బుధవారం) అర్ధరాత్రి నుంచే ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా.. వారి మధ్య నలిగిపోయే యువకుడిగా శర్వానంద్ నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

సినిమాలో కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా వీకే నరేష్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శీను వంటి భారీ హాస్య బృందం ఈ సినిమాలో ఉంది. శర్వానంద్ కి, వీకే నరేష్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించాయి. అంతేకాకుండా యంగ్ హీరో శ్రీ విష్ణు ఒక సర్ప్రైజ్ క్యామియో రోల్ పాత్రలో కనిపించి తన వంతు మెరుపులు మెరిపించారు. విశాల్ చంద్ర శేఖర్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది.

కుటుంబం అంతా కలిసి చూసేలా ఒక క్లీన్ కామెడీ సినిమాగా నారీ నారీ నడుమ మురారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మీరు సంక్రాంతి బిజీలో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయ్యి ఉంటే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో చూసేందుకు ఇది సరైన సమయం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ విలేజ్ లో కూడా పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Tags:    

Similar News