Sreeleela: వరుస ప్లాపులున్నా తగ్గని క్రేజ్.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల

Sreeleela: టాలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిన శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది.

Update: 2026-02-03 04:03 GMT

Sreeleela: వరుస ప్లాపులున్నా తగ్గని క్రేజ్.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల

Sreeleela: టాలీవుడ్‌లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలిగిన శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. వరుస ప్లాపులు పలకరిస్తున్నా, ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన చాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే అవకాశాలు వస్తాయనేది ఒక నానుడి. కానీ శ్రీలీల విషయంలో అది రివర్స్ అవుతోంది. ఇటీవల విడుదలైన 'పరాశక్తి'తో కలిపి వరుసగా ఏడో ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్‌ పక్కన హీరోయిన్‌గా ఎంపికై వార్తల్లో నిలిచింది.

సాయిపల్లవి ప్లేస్‌లో శ్రీలీల

శివకార్తికేయన్‌తో చేసిన 'పరాశక్తి' డిజాస్టర్ అయినప్పటికీ, శ్రీలీలకు కోలీవుడ్‌లో మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. 'అమరన్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి, ధనుష్ హీరోగా ఒక భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా సాయిపల్లవి పేరు వినిపించింది. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకోగా, ఆ అవకాశం శ్రీలీల తలుపు తట్టింది. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ధనుష్‌తో శ్రీలీల ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తున్నా, శ్రీలీల ప్లాన్ మాత్రం చాలా పెద్దదే. ఆమె ఇప్పుడు బాలీవుడ్‌పై కూడా గట్టిగా గురి పెట్టింది. కార్తీక్ ఆర్యన్ సరసన 'ఆషికీ 3'తో హిందీలో ఎంట్రీ ఇస్తోంది. డెబ్యూ మూవీ రాకముందే 'నాగ్జిల్లా' అనే హారర్ ఫాంటసీ మూవీకి కూడా సైన్ చేసింది. పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'పైనే శ్రీలీల ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ధనుష్‌తో చేయబోయే సినిమాలో శ్రీలీల పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. 'అమరన్' తరహాలోనే దేశం కోసం పోరాడిన ఒక అన్‌సంగ్ హీరో కథాంశంతో ఈ సినిమా రాబోతోంది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు స్కోప్ ఉన్న పాత్రలో శ్రీలీల కనిపించబోతోంది. వరుస ప్లాపులు పలకరిస్తున్నా వెనకడుగు వేయకుండా, పెద్ద ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్న శ్రీలీల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మరి ఈ ధనుష్ సినిమా అయినా శ్రీలీలకు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News