O Torture Prema Title Poster: ప్రేమ మార్గంలో మాదాల మూడో తరం వారసుడు.. సన్నీ మాదాల హీరోగా 'ఓ టార్చర్ ప్రేమ'

O Torture Prema Title Poster: టాలీవుడ్‌లోకి మరో వారసుడు ఘనంగా అరంగేట్రం చేస్తున్నాడు.

Update: 2026-02-04 05:59 GMT

O Torture Prema Title Poster: టాలీవుడ్‌లోకి మరో వారసుడు ఘనంగా అరంగేట్రం చేస్తున్నాడు. 'ఎర్రన్న'గా పేరుగాంచిన మాదాల రంగారావు మనవడు, మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం "ఓ టార్చర్ ప్రేమ". శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకర్ కృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను తాజాగా ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.

పోస్టర్ లాంచ్ అనంతరం పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. "మాదాల రంగారావు గారి మనవడు సన్నీ మాదాల హీరోగా రావడం సంతోషంగా ఉంది. తాత, తండ్రి ఇద్దరూ విప్లవ మార్గంలో నడిస్తే, మూడో తరం వారసుడు సన్నీ మాత్రం 'ఓ టార్చర్ ప్రేమ' అంటూ ప్రేమ మార్గాన్ని ఎంచుకున్నాడు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ, దివంగత దాసరి నారాయణరావు గారి తరహాలో రచన, దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడం అభినందనీయం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి" అని ఆకాంక్షించారు.

దర్శక-నిర్మాత శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం. సినిమాలో నవ్వులు చిందించే వినోదంతో పాటు, ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే భావోద్వేగపూరిత సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి" అని తెలిపారు.

Tags:    

Similar News