బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సాయి పల్లవి.. సీత పాత్రలో ఫిదా బ్యూటీ..!

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి తన అందం మరియు సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.

Update: 2022-12-06 15:00 GMT

బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సాయి పల్లవి.. సీత పాత్రలో ఫిదా బ్యూటీ..!

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి తన అందం మరియు సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయి, విరాటపర్వం, గార్గి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి తన సోదరి పూజా కన్నం తో కలిసి ఒక హాస్పెటల్ నిర్మించే పనులు చూసుకోబోతుందని వార్తలు వినిపించాయి. కానీ ఈ పుకార్లకు చెక్ పెడుతూ సాయి పల్లవి తదుపరి సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అతి త్వరలోనే సాయి పల్లవి బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది సాయి పల్లవి. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించని ఉండగా సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుందట. ముందుగా ఈ పాత్ర కోసం దీపికా పడుకొనే, కరీనా కపూర్‌ల పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా దర్శక నిర్మాతలు సాయి పల్లవిని ఓకే చేశారు.

ఇక హృతిక్ రోషన్ శ్రీరాముడి పాత్రలో ఈ సినిమాలో కనిపించాల్సి ఉంది కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ రణబీర్ కపూర్ చేతుల్లోకి వెళ్ళింది. ఇక హృతిక్ రోషన్ ఇప్పుడు ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడున్నాయి. ఇక నార్త్ ఆడియన్స్ కూడా సాయి పల్లవిని హిందీ సినిమాలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News