Bigg Boss 9 : టైటిల్ దక్కకపోయినా పారితోషికంతోనే విన్నర్ అయిన భరణి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోకు మరికొన్ని రోజుల్లో ఎండ్‌కార్డ్ పడనుంది. మహా అయితే ఇంకో వారంలో ఈ సీజన్ టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు.
Bigg Boss 9 : టైటిల్ దక్కకపోయినా పారితోషికంతోనే విన్నర్ అయిన భరణి
Bigg Boss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోకు మరికొన్ని రోజుల్లో ఎండ్‌కార్డ్ పడనుంది. మహా అయితే ఇంకో వారంలో ఈ సీజన్ టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. ఈ కీలక సమయంలో 14వ వారంలో ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. మొదటగా శనివారం ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ కాగా, ఆదివారం నాటి ఎపిసోడ్‌లో సీరియల్ నటుడు భరణి శంకర్ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
భరణి శంకర్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడం ఇది రెండోసారి. ఇదివరకు 6వ వారంలో ఎలిమినేట్ అయిన భరణికి, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కారణంగా 8వ వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చారు. రీ-ఎంట్రీ తర్వాత కొంతకాలం దివ్య నిఖితతో స్నేహం, అనవసరపు వాదనలు మినహా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దివ్య ఎలిమినేషన్ తర్వాత భరణి ఆటలో వేగం అందుకున్నా, అప్పటికే ప్రేక్షకులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌లను ఫిక్స్ చేసుకోవడంతో రీ-ఎంట్రీ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. అందరూ సంజన ఎలిమినేట్ అవుతుందని భావించినప్పటికీ, అనూహ్యంగా భరణి ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాకిచ్చింది. ఈ విధంగా సన్నిహితంగా ఉన్న సుమన్ శెట్టి, భరణి శంకర్ ఒకే వారంలో బయటకు రావడం విశేషం.
భరణి శంకర్ ఎలిమినేషన్ తర్వాత ఆయన పారితోషికం పై ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌లో భరణి శంకర్ రెమ్యూనరేషన్ అత్యధికంగా ఉందని టాక్ నడుస్తోంది. ఆయనకు రోజుకు సుమారు రూ.50 వేలు చొప్పున, వారానికి రూ.3.50లక్షల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.
మొదటి 6 వారాలు రూ. 21 లక్షలు, రీ-ఎంట్రీ తర్వాత 6 వారాలు (8వ వారం నుంచి 14వ వారం వరకు) రూ. 21 లక్షలు ఇలా మొత్తం సీజన్లో ఆయన ఏకంగా రూ. 42 లక్షలు సంపాదించినట్లు లెక్క. ఈ లెక్కన, బిగ్ బాస్ టైటిల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీకి దగ్గరగా భరణి శంకర్ పారితోషికం ద్వారా సంపాదించినట్లు తెలుస్తోంది.
భరణి ఎలిమినేషన్ ప్రకటించగానే ఆయనను నాన్న అని పిలిచే తనుజ షాక్ అయ్యి, ఎమోషనల్‌గా అతని కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంది. ఇమ్మాన్యుయేల్ చప్పట్లు కొట్టగా, భరణి మాత్రం హౌస్‌మేట్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. స్టేజ్‌పై నాగార్జున చూపించిన భరణి జర్నీ వీడియోలో కేవలం తనూజ, దివ్య, సుమన్ శెట్టి మాత్రమే కనిపించారు. భరణి వీడ్కోలు సందర్భంగా ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, సంజన, డెమాన్ పవన్‌లకు ఆల్ ది బెస్ట్ చెప్పి, తనుజ ట్రోఫీ ఎత్తాలని ఆకాంక్షించాడు. భరణి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్‌లో తనూజ, కళ్యాణ్, డెమాన్ పవన్, సంజన, ఇమ్మాన్యుయేల్ టాప్ 5 కంటెస్టెంట్లుగా మిగిలారు. ఈ సీజన్ విన్నర్ కోసం తనూజ, కళ్యాణ్ మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తోందని సమాచారం.