Ustaad Bhagat Singh Release Date: పవన్‌ కల్యాణ్ 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' రిలీజ్ డేట్ వచ్చేసింది.. మార్చి 26న బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ జాతర!

Ustaad Bhagat Singh Release Date: పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' (Ustaad Bhagat Singh) సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది.

Update: 2026-02-04 11:41 GMT

Ustaad Bhagat Singh Release Date: పవన్‌ కల్యాణ్ 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' రిలీజ్ డేట్ వచ్చేసింది.. మార్చి 26న బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ జాతర!

Ustaad Bhagat Singh Release Date: పవన్‌ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' (Ustaad Bhagat Singh) సినిమా విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

'గబ్బర్‌ సింగ్‌' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, 'దేఖ్‌లేంగే సాలా' వంటి పాటలు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి చివరి వారంలో సినిమాను విడుదల చేయడం ద్వారా సమ్మర్ సెలవులను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి షూటింగ్ పూర్తి చేయడం విశేషం.

Tags:    

Similar News