Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌ ప్రకంపనలు.. వైరల్ వార్తలపై నోరు విప్పిన అనురాగ్ కశ్యప్: "అసలు నేను అక్కడికే వెళ్ళలేదు!"

Epstein Files: సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ఉందంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. తాను ఎప్పుడూ బీజింగ్ వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు.

Update: 2026-02-06 00:30 GMT

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌ ప్రకంపనలు.. వైరల్ వార్తలపై నోరు విప్పిన అనురాగ్ కశ్యప్: "అసలు నేను అక్కడికే వెళ్ళలేదు!"

Epstein Files: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ (Epstein Files) ప్రకంపనలు బాలీవుడ్‌ను తాకుతున్నాయి. ఈ వివాదాస్పద జాబితాలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పేరు కూడా ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ రూమర్లపై తాజాగా అనురాగ్ కశ్యప్ స్పందించారు.

అసలేం జరిగింది? లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2017లో అనురాగ్ కశ్యప్ బీజింగ్ వెళ్లారనేది సదరు ప్రచారం సారాంశం. దీనిపై ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన, ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేశారు.

అనురాగ్ కశ్యప్ వివరణ:

"నాకు వక్తగా నెలకు కనీసం 15 ఆహ్వానాలు వస్తుంటాయి. కానీ నేను చాలా అరుదుగా మాత్రమే వాటికి అంగీకరిస్తాను. నా జీవితంలో నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా బీజింగ్‌ వెళ్లలేదు. నా సినిమాల గురించి చర్చించడం మానేసి, ఇలాంటి పనికిరాని విషయాల్లో నా పేరును లాగడం విచారకరం" అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

అనురాగ్ కశ్యప్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా ఈ ఫైల్స్‌లో ఉన్నాయంటూ వార్తలు వస్తుండటం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News