Varanasi Movie: వారణాసి 2 రాజమౌళి సంచలన ప్రకటన
Varanasi Movie: రాజమౌళి-మహేశ్ బాబు కలయికలో వస్తున్న 'వారణాసి' చిత్రం ప్రస్తుతం ప్రపంచ సినిమా వేదికపై హాట్ టాపిక్‌గా మారింది.
Varanasi Movie: వారణాసి 2 రాజమౌళి సంచలన ప్రకటన
Varanasi Movie: రాజమౌళి-మహేశ్ బాబు కలయికలో వస్తున్న 'వారణాసి' చిత్రం ప్రస్తుతం ప్రపంచ సినిమా వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను పంచుకోవడంతో అభిమానుల ఉత్కంఠకు తెరపడింది.
ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి రాజమౌళి స్వస్తి పలికారు. కథా నిడివి దృష్ట్యా రెండు భాగాలు చేయాలని భావించినప్పటికీ, చివరికి దీనిని సింగిల్ పార్ట్ సినిమాగానే విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే, కథలోని లోతును ఏమాత్రం తగ్గించకుండా దాదాపు మూడు గంటలకు పైగా రన్ టైమ్‌తో ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మరో ఆరు నుంచి ఏడు నెలల్లో పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో మహేశ్ బాబు 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రలో రాముడి ఛాయలు ఉంటాయని సమాచారం.అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం కేవలం ప్రమోషన్ల కోసమే సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు టాక్.'RRR' తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో, హాలీవుడ్ స్థాయిలో దీనిని మార్కెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్, భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమనిపిస్తోంది.