Barabar Premistha: చంద్రహాస్ పాటపై దుమారం: అసభ్య పదజాలంపై క్షమాపణలు చెప్పిన చిత్రయూనిట్.. జేడీ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు!
Chandrahas Song Controversy: యంగ్ హీరో చంద్రహాస్ నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది.
Chandrahas Song Controversy: యంగ్ హీరో చంద్రహాస్ నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వేడుకలో చంద్రహాస్ పాడిన 'గుంజి గుంజి' పాటలో అసభ్య పదజాలం వాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకనిర్మాతలతో పాటు నటుడు జేడీ చక్రవర్తి స్పందించారు.
పొరపాటు జరిగింది - నిర్మాత విచారం:
ఈ వివాదంపై నిర్మాత చిన్ని స్పందిస్తూ.. చంద్రహాస్ తన పాత్ర స్వభావాన్ని వివరించే క్రమంలో ఆ పాట పాడారని, అందులో అసభ్య పదాలు దొర్లడం యాదృచ్ఛికంగా జరిగిన పొరపాటు అని తెలిపారు. ఈ విషయంపై ఈవెంట్‌లో ఉన్న ఎవరికీ ముందుగా అవగాహన లేదని, చంద్రహాస్ కావాలని చేయలేదని ఆయన వివరించారు. పాట పాడి కిందకు వచ్చిన తర్వాత అతడిని మందలించినట్లు నిర్మాత వెల్లడించారు.
సినిమాలో అలాంటి పాటలు లేవు:
దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. చంద్రహాస్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. అయితే, సినిమాలో ఎక్కడా ఇలాంటి అసభ్యకరమైన పాటలు లేవని, కేవలం స్టేజ్ పైన మాత్రమే ఇది జరిగిందని స్పష్టం చేశారు.
జేడీ చక్రవర్తి స్పందన:
చంద్రహాస్ పాట పాడుతున్నప్పుడు వేదికపై ఉన్న జేడీ చక్రవర్తి ఆపలేదన్న విమర్శలపై ఆయన స్పందించారు. సినిమా ప్రమోషన్లు విభిన్నంగా చేయడం తప్పు కాదని, కానీ మహిళలను కించపరిచేలా లేదా అసభ్యకరంగా ఉండకూడదని ఆయన హితవు పలికారు. ఆ సమయంలో తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందని జేడీ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.