ఆ సినిమా చేసిన తర్వాత ఏం చేయాలో అర్ధం కాలేదు

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన జక్కన్న రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'SSMB29'. ఈ సినిమాకు 'వారణాసి' అనే పేరును టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు.

Update: 2026-02-05 23:30 GMT

ఆ సినిమా చేసిన తర్వాత ఏం చేయాలో అర్ధం కాలేదు

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన జక్కన్న రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'SSMB29'. ఈ సినిమాకు 'వారణాసి' అనే పేరును టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్‌లో మహేష్ బాబు రుద్రగా కనిపించబోతుండటం విశేషం.

ప్రాంతీయ హద్దులు చెరిపేసి అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (మందాకినిగా), మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (కుంభగా) హాలీవుడ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వడం సినిమా రేంజ్‌ని తెలియజేస్తోంది.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా మహేష్ బాబు తన కెరీర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తనను ఒక స్టార్‌గా నిలబెట్టిన 'పోకిరి' (2006) గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా మారాయి. పోకిరి నన్ను ఒక కమర్షియల్ స్టార్‌గా మార్చింది. కానీ ఆ సక్సెస్ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా గందరగోళానికి గురయ్యాను.

ప్రేక్షకుల అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో, సరైన కథను ఎంచుకోవడం సవాలుగా మారింది.అయితే, ఇప్పుడు 'వారణాసి' చేస్తున్నప్పుడు కలుగుతున్న అనుభవం పూర్తిగా భిన్నం. ఇది నా మైండ్ సెట్‌ని, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News