Abhishek Bachchan : ఐశ్వర్య రాయ్తో విడాకులు, నిమ్రత్ కౌర్‌తో సంబంధం?.. పుకార్లపై స్పందించిన అభిషేక్ బచ్చన్
Abhishek Bachchan : బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ చాలా కాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా తరచుగా వార్తల్లో ఉంటున్నారు.
Abhishek Bachchan : ఐశ్వర్య రాయ్తో విడాకులు, నిమ్రత్ కౌర్‌తో సంబంధం?.. పుకార్లపై స్పందించిన అభిషేక్ బచ్చన్
Abhishek Bachchan: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ చాలా కాలంగా తన వ్యక్తిగత జీవితం కారణంగా తరచుగా వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా ఆయన తన భార్య ఐశ్వర్య రాయ్తో విడాకులు తీసుకోబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఈ సమయంలోనే నటి నిమ్రత్ కౌర్తో ఆయనకు వివాహేతర సంబంధం ఉందంటూ తీవ్రమైన పుకార్లు షికారు చేశాయి. వీరిద్దరూ కలిసి దస్వీ సినిమాలో నటించారు. ఈ బలమైన పుకార్లపై అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు మౌనం వీడారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ ఈ పుకార్ల గురించి మాట్లాడారు. ఆయన నేరుగా నిమ్రత్ కౌర్ పేరును ప్రస్తావించనప్పటికీ, ఇలాంటి వదంతులు తన జీవితంలో చాలా సమస్యలు సృష్టించాయని తెలిపారు. "తప్పుడు లేదా అబద్ధపు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తికి, దాన్ని సరిదిద్దాలనే లేదా స్పష్టం చేయాలనే ఉద్దేశం ఉండదు. మొదట్లో నా గురించి వచ్చే వార్తలు నన్ను పెద్దగా బాధించేవి కావు. కానీ ఇప్పుడు నాకు ఒక కుటుంబం ఉంది. అందువల్ల ఇలాంటి వార్తలు నాకు చాలా ఆందోళన కలిగిస్తాయి" అని అభిషేక్ అన్నారు.
"నేను కొన్ని విషయాలపై వివరణ ఇచ్చినప్పటికీ, ప్రజలు దాన్ని వ్యతిరేక పద్ధతిలో అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్ వార్తలే బాగా అమ్ముడవుతాయి. మీరు నా స్థానంలో లేరు. మీరు నా జీవితాన్ని గడపడం లేదు. నేను ఎవరికి జవాబుదారీగా ఉండాలో, వారికి మీరు జవాబుదారీగా ఉండరు" అని అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే "ఇలాంటి నెగెటివిటీని వ్యాప్తి చేసే వ్యక్తులు, వారు తమ మనస్సాక్షికి జవాబు చెప్పుకోవాలి. వారు తమ మనస్సాక్షికి తగ్గట్టుగా వ్యవహరించాలి. తమ సృష్టికర్తకు సమాధానం చెప్పాలి. చూడండి, ఇది కేవలం నా గురించి మాత్రమే కాదు. ఇది కేవలం నా ఒక్కడిపైనే ప్రభావం చూపదు. ఇక్కడ ఎంత కఠినమైన పరిస్థితి ఉందో నాకు తెలుసు. కుటుంబాలు ఇందులో ఇరుక్కుంటాయి. ఈ ట్రోలింగ్ అనే కొత్త ధోరణికి ఇది మీకు మంచి ఉదాహరణ" అని అభిషేక్ బచ్చన్ తెలిపారు.
నిమ్రత్ కౌర్‌తో అభిషేక్ సంబంధం గురించి పుకార్లు పెద్ద ఎత్తున వ్యాపించినప్పుడు, బచ్చన్ కుటుంబానికి సన్నిహితులైన ఒక వ్యక్తి స్పందించారు. అభిషేక్ బచ్చన్ తన భార్యకు ఎప్పటికీ మోసం చేయడని, తమ బంధంలో అభిషేక్ ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటాడని ఆ వ్యక్తి స్పష్టం చేశారు.