Prabhas The Raja Saab: విడుదలకు ముందే రాజాసాబ్ రికార్డు!

Prabhas The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

Update: 2025-12-15 09:21 GMT

Prabhas The Raja Saab: విడుదలకు ముందే రాజాసాబ్ రికార్డు!

Prabhas The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో 100K డాలర్లు దాటింది. ఈ విజయం ప్రమోషన్లకు మరింత ఊపు ఇస్తుంది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం 2026 జనవరి 9న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన తొలి సింగిల్ రెబల్ సాబ్ మంచి హైప్ సృష్టించగా, రెండో పాట త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే ఈ చిత్రం 100K డాలర్లకు పైగా వసూళ్లు సాధించడం గమనార్హం. ప్రమోషనల్ యాక్టివిటీస్ బలంగా సాగితే ఓవర్సీస్ మార్కెట్‌లో మరింత ర్యాంపేజ్ సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాతలుగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News