The Raja Saab OTT Release: ఓటీటీలోకి 'రాజా సాబ్' వచ్చేశాడు..!
The Raja Saab OTT Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది.
The Raja Saab OTT Release: ఓటీటీలోకి 'రాజా సాబ్' వచ్చేశాడు..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. థియేటర్లలో సందడి చేసిన ఈ హారర్ కామెడీ డ్రామా, ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్స్‌పై అలరించడానికి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం, కేవలం 28 రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది. నేటి (ఫిబ్రవరి 6) అర్ధరాత్రి నుంచి జియో హాట్ స్టార్ (Jio Hotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, కేవలం సినిమాను రిలీజ్ చేయడమే కాకుండా, మేకర్స్ ఒక క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చారు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. హిందీ వెర్షన్ మరికొద్ది రోజుల్లో రానుంది.
థియేటర్లలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల , రన్ టైమ్ దృష్ట్యా కట్ చేసిన దాదాపు 8 నుంచి 10 నిమిషాల ఎక్స్‌ట్రా ఫుటేజ్‌ను ఓటీటీ వెర్షన్‌లో జోడించారు. ఇందులో ప్రభాస్ ఓల్డ్ లుక్‌కు సంబంధించిన సీన్స్ హైలైట్‌గా నిలవనున్నాయి.ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం రిమైండ్ మీ బటన్‌ను లక్షలాది మంది క్లిక్ చేయడంతో, ట్రాఫిక్ తట్టుకోవడానికి జియో హాట్ స్టార్ తన సర్వర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి వచ్చిందంటే ప్రభాస్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ముగ్గురు భామల గ్లామర్.. వింటేజ్ ప్రభాస్ మేనరిజం
దర్శకుడు మారుతి, ప్రభాస్‌ను చాలా కాలం తర్వాత ఒక పక్కా లోకల్ మాస్ అండ్ కామెడీ రోల్‌లో చూపించారు.నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తమ అందచందాలతో సినిమాకు మంచి హైప్ ఇచ్చారు.తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా రెబల్ సాబ్ సాంగ్ ఓటీటీలో కూడా మోత మోగించడం ఖాయం.
చిన్న నిరాశ.. పెద్ద అవకాశం
థియేటర్లలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించి, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. థియేటర్లో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ హారర్ కామెడీని ఎంజాయ్ చేసే అవకాశం దొరికింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.208 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి తన ప్రయాణాన్ని ముగించింది. ప్రభాస్ వింటేజ్ లుక్, అదిరిపోయే కామెడీ టైమింగ్ , థియేటర్లో లేని సరికొత్త సన్నివేశాల కోసం 'ది రాజా సాబ్'ను జియో హాట్ స్టార్‌లో వెంటనే చూసేయండి.