కార్తీ కోసం క్యూ కట్టిన టాలీవుడ్ యంగ్ దర్శకులు..?

తమిళ నటుడు కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితుడు. ఇక్కడి మార్కెట్‌తో పాటు అభిమానుల లవ్ కారణంగా యంగ్ దర్శకులు కార్తీ కాల్‌షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

Update: 2025-12-15 10:38 GMT

తమిళ నటుడు కార్తీ టాలీవుడ్ ప్రేక్షకులకు చిరపరిచితుడు. ఇక్కడి మార్కెట్‌తో పాటు అభిమానుల లవ్ కారణంగా యంగ్ దర్శకులు కార్తీ కాల్‌షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది దర్శకులు ఇప్పటికే కార్తీకి కథలు చెప్పారు.

కోలీవుడ్ నటుడైన కార్తీ టాలీవుడ్‌లో కూడా భారీ మార్కెట్ సృష్టించుకున్నాడు. ఇక్కడి ప్రేక్షకుల అభిమానం కారణంగా యంగ్ దర్శకులు కార్తీపై దృష్టి పెట్టారు. ఇటీవల ‘ అన్నగారు వస్తారు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. శివ నిర్వాణ కార్తీకి ఒక కథ చెప్పాడు కానీ వర్కవుట్ కాలేదు. అదే కథను తర్వాత రవితేజకు చెప్పి ఓకే చేయించుకున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. వెంకీ కుడుముల కార్తీకి స్క్రిప్ట్ వినిపించగా ఆనందంగా నవ్వాడు కానీ మరో కొత్త కథ రెడీ చేయమని సూచించాడట. నాని హీరోగా 'సరిపోదా శనివారం’తో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ కూడా కార్తీని కలిసి స్టోరీ నెరేట్ చేశాడు. త్వరలో పూర్తి స్క్రిప్ట్ వినిపించనున్నాడు. అయితే కార్తీ మాత్రం ‘హిట్ 3’లో కీలక పాత్ర పోషించి ‘హిట్ 4’కు లీడ్‌గా మారిన నేపథ్యంలో దర్శకుడు శైలేష్ కొలను స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 

Tags:    

Similar News