రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ: నిరసనలు మధ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం
బాలు విగ్రహావిష్కరణ కాసేపట్లో రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ బాలు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ: నిరసనలు మధ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం
కాసేపట్లో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బాలు విగ్రహావిష్కరణను తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు.
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. మన అందరికి సపరిచితమైన పేరు. గాన గంధర్వుడు.... ఆయన పాడితే పాట మాత్రమే కాదు…భావం కూడా వినిపిస్తుంది.
ప్రేమ పాటైనా సరే, వేదన పాటైనా సరే,భక్తి గీతమైనా సరే…బాలు గొంతు పడితే ఆ పాట మన జీవితంలో భాగం అవుతుంది.తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం అని కాదు…16కి పైగా భాషల్లో
40 వేలకుపైగా పాటలు పాడారు. ఇంతటి కళాకారునికి ఎన్నో వివాదాల తర్వాత ఈరోజు రవీంద్రభారతిలో ఆయన విగ్రహ ఆవిష్కరణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
కాసేపట్లో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరగనున్నది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరో వైపు బాలసుబ్రమణ్యం విగ్రహా ఏర్పాటును తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. లంగాణ జాగృతి అధ్యక్షరాలు కవిత, ఉద్యమకారుడు పృథ్విరాజ్ సహా పలువురు తెలంగాణ వాదులు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణ కళాకారులు విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్టీయ గీతాన్ని పాడటానికి నిరాకరించిన బాలసుబ్రమణ్యం విగ్రహబాన్ని ఏర్పాటు చేయవద్దంటూ నిరసన తెలుపుతున్నారు.
విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన తెలంగాణవాదులు...
నిరసన తెలిపేందుకు సిద్ధమైన వారిని హౌస్ అరెస్టు చేస్తున్న పోలీసులు
రవీంద్ర భారతితో పాటు పరిసర ప్రాంతాల్లోభారీగా మోహరించిన పోలీసులు...
తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్...
తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని పాడటానికి నిరాకరించిన బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దంటూ పలువురు డిమాండ్