Casting Couch : నా తల్లి దగ్గరకు వెళ్లి కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారు

సినిమా గ్లామర్ ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి నిజాలను, ముఖ్యంగా మహిళా నటులు ఎదుర్కొంటున్న 'క్యాస్టింగ్ కౌచ్' వేధింపులను మరోసారి వెలుగులోకి తెచ్చారు విలక్షణ నటి కని కుశృతి.

Update: 2026-02-07 05:16 GMT

Casting Couch : నా తల్లి దగ్గరకు వెళ్లి కమిట్‌మెంట్ ఇవ్వాలని అడిగారు

సినిమా గ్లామర్ ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి నిజాలను, ముఖ్యంగా మహిళా నటులు ఎదుర్కొంటున్న 'క్యాస్టింగ్ కౌచ్' వేధింపులను మరోసారి వెలుగులోకి తెచ్చారు విలక్షణ నటి కని కుశృతి. కేవలం మలయాళంలోనే కాకుండా 'బిర్యానీ', 'స్పైడర్' మరియు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందిన ఈ నటి, తాజాగా ఇండస్ట్రీలోని దారుణమైన పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆమె మాటల్లో చెప్పాలంటే.. ఇక్కడ ప్రతిభ కంటే కమిట్‌మెంట్‌కే ప్రాధాన్యం ఇచ్చే నీచ సంస్కృతి పాతుకుపోయింది.

మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కని కుశృతికి, ఆదిలోనే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవకాశాలు దక్కాలంటే దర్శక నిర్మాతలకు కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని, ఆ సుఖం ఇస్తేనే పాత్రలు ఇస్తామని ముఖం మీదే చెప్పేవారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నటనలో ప్రతిభను నిరూపించుకునే లోపే ఇలాంటి శారీరక ఒత్తిళ్లు ఎదురవ్వడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొన్నారు.

సాధారణంగా ఇలాంటి విషయాలు మాట్లాడటానికి ఎవరైనా భయపడతారు. కానీ, కొందరు కామాంధులు కని విషయంలో ఏకంగా ఆమె తల్లి దగ్గరే బేరానికి దిగడం షాక్‌కు గురి చేస్తోంది. నా దగ్గర నేరుగా మాట్లాడటానికి ఇబ్బంది పడేవారు మా అమ్మను కలిసి.. నీ కూతురికి అవకాశాలు రావాలంటే ఆమె కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని కరాఖండీగా చెప్పేవారని కని వెల్లడించిన విషయం విని నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

ఈ వేధింపులు భరించలేక తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె చాలా కాలం సినిమా రంగానికి దూరంగా ఉన్నారు. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో, మనసు చంపుకుని మళ్ళీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సి వచ్చిందని ఆమె నిజాయితీగా ఒప్పుకున్నారు. కేవలం పొట్టకూటి కోసం తనకిష్టం లేని వాతావరణంలో పని చేయాల్సి రావడం ఎంతటి నరకమో ఆమె మాటల్లో వివరించారు.

Tags:    

Similar News