Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ దండయాత్ర
Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సృష్టించిన సునామీ ఇంకా కళ్లముందే కదలాడుతోంది.
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ దండయాత్ర
Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' సృష్టించిన సునామీ ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి, రూ.1300 కోట్ల వసూళ్లతో ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, ఇప్పుడు సీక్వెల్‌తో ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైంది. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధురంధర్ 2’ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇది నూతన భారతదేశం… సరిహద్దులు దాటి చొరబడుతుంది… దెబ్బ కొట్టి తీరుతుంది అనే పవర్‌ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొదటి భాగంలో భారత గూఢచారిగా మెప్పించిన రణ్‌వీర్, ఈసారి మరింత డార్క్ అండ్ పవర్‌ఫుల్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగకముందే బడ్జెట్‌ను రికవరీ చేసి సంచలనం సృష్టించింది.బడ్జెట్ సుమారు రూ.250 కోట్లు.డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారానే రూ.250 కోట్లకు పైగా ఆదాయం లభించింది.మ్యూజిక్ రైట్స్ కోసం టీ-సిరీస్ రూ.60 కోట్లు, డిజిటల్ రైట్స్ కోసం జియో హాట్‌స్టార్ ఏకంగా రూ.150 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.
మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదలై రూ.1300 కోట్లు రాబట్టింది. కానీ, మార్చి 19, 2026న విడుదల కానున్న ‘ధురంధర్ 2’ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ చిత్రం సునాయాసంగా రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ మైలురాయిగా నిలవబోతోంది. ఈ స్పై యూనివర్స్ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.