Pushpa 2 : అల్లు అర్జున్ దెబ్బకు జపాన్ బాక్సాఫీస్ షేక్.. అక్కడ కూడా ‘పుష్ప’గాడి రూలే..!

Pushpa 2: నడకలో నయా స్టైల్.. మాటలో తగ్గేదే లే అనే పవర్.. వెరసి భారతదేశాన్ని ఊపేసిన 'పుష్ప 2: ది రూల్' ఇప్పుడు ఖండాంతరాలు దాటి జపాన్ గడ్డపై తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

Update: 2026-02-07 05:15 GMT

Pushpa 2: నడకలో నయా స్టైల్.. మాటలో తగ్గేదే లే అనే పవర్.. వెరసి భారతదేశాన్ని ఊపేసిన 'పుష్ప 2: ది రూల్' ఇప్పుడు ఖండాంతరాలు దాటి జపాన్ గడ్డపై తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లర్‌గా బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టిన పుష్పరాజ్, ఇప్పుడు జపనీస్ ఆడియన్స్‌ను తన గ్యాంగ్‌లో కలిపేసుకుంటున్నాడు.

జనవరి 16న ‘పుష్ప కున్రిన్’ పేరుతో జపాన్ థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా, కేవలం రెండు వారాల్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..ఇప్పటి వరకు సుమారు ¥105 మిలియన్లు (రూ. 6.1 కోట్లు) సాధించింది.ఇప్పటి వరకు జపాన్‌లో పదో స్థానంలో ఉన్న అమీర్ ఖాన్ ‘ధూమ్ 3’ రికార్డును బద్దలు కొట్టి, టాప్-10 భారతీయ సినిమాల జాబితాలోకి పుష్ప 2 చేరిపోయింది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ చిత్రం రూ. 1871 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ ఘనవిజయం వెనుక అల్లు అర్జున్ పక్కా ప్లానింగ్ ఉంది. రష్మిక మందన్నతో కలిసి జపాన్ వెళ్ళిన బన్నీ, టోక్యోలో జరిగిన ఈవెంట్లలో సందడి చేశారు. తన మేనరిజమ్స్‌తో, ముఖ్యంగా జపనీస్ భాషలో చెప్పిన డైలాగులతో అక్కడి ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. సుకుమార్ మేకింగ్ మరియు బన్నీ స్టైల్ జపాన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుండటంతో, టోక్యో, ఒసాకా వంటి నగరాల్లో థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.

జపాన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ‘RRR’ ($ 2.42 బిలియన్లు) అగ్రస్థానంలో ఉండగా, బాహుబలి 2, సాహో, మగధీర వంటి సినిమాలు కూడా టాప్ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా ఆ ఎలైట్ క్లబ్‌లో చేరడం టాలీవుడ్ సత్తాను చాటిచెబుతోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో రూ. 800 కోట్లు సాధించిన ఏకైక భారతీయ సినిమాగా నిలిచిన పుష్ప, ఇప్పుడు విదేశీ గడ్డపై కూడా అదే వేడిని కొనసాగిస్తోంది.

సినిమా క్లైమాక్స్‌లో ‘పుష్ప 3: ది రాంపేజ్’ ఉంటుందని ప్రకటించడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఒక ప్రాంతీయ కథాంశంతో మొదలై, ప్రపంచవ్యాప్తంగా ‘బ్రాండ్’గా మారడం అల్లు అర్జున్ కష్టానికి నిదర్శనం. జపాన్‌లో ఈ పుష్ప గాలులు ఇంకా ఎంత దూరం వెళ్తాయో చూడాలి.

Tags:    

Similar News