ఆ తరువాతే నెక్స్ట్ సినిమా గురించి ప్రకటించనున్న రామ్ చరణ్
* తాజాగా ఒక కన్నడ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా ఉంటుంది
ఆ తరువాతే నెక్స్ట్ సినిమా గురించి ప్రకటించనున్న రామ్ చరణ్
Ram Charan: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలో ఇప్పుడు కేవలం ఒక్క ప్రాజెక్టు మాత్రమే ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తన కెరియర్ లోనే 15వ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది. దీంతో రాంచరణ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతోంది అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఒక కన్నడ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ దాని గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే తాజాగా "ఆర్ఆర్ఆర్" సినిమాని ప్రమోట్ చేయడానికి జపాన్ వెళ్ళిన రామ్ చరణ్ ప్రమోషన్ పనులు పూర్తయ్యాక అక్కడే హాలిడేని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇవన్నీ పూర్తి చేసుకొని గురువారం ఉదయం హైదరాబాద్ కి తిరిగి వచ్చారు రామ్ చరణ్.
ఇక త్వరలోనే తన 16వ సినిమా గురించి ఒక నిర్ణయానికి వచ్చి అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక మరొక వారంలో రామ్ చరణ్ శంకర్ సినిమా కోసం న్యూజిలాండ్ పయణమవ్వనున్నారు. 10 రోజులపాటు చిత్ర షూటింగ్ అక్కడ జరగబోతోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కి సిద్ధమవుతోంది.