వారణాసిలో రాముడే కాదు.. బ్రహ్మ–విష్ణు–మహేశ్వర పాత్రలు, అఘోరా క్యారెక్టర్‌తో రాజమౌళి సెన్సేషన్ ప్లాన్!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం 'వారణాసి'.
వారణాసిలో రాముడే కాదు.. బ్రహ్మ–విష్ణు–మహేశ్వర పాత్రలు, అఘోరా క్యారెక్టర్‌తో రాజమౌళి సెన్సేషన్ ప్లాన్!
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా చిత్రం 'వారణాసి'. ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఎక్స్‌క్లూజివ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కీలక ఎపిసోడ్‌లో రాముడు ఒక్కడే కాదు.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పాత్రలు కూడా కనిపించబోతున్నాయన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఇప్పటివరకు వారణాసి చిత్రంలో రామాయణ ఛాయలు ఉంటాయనే ప్రచారం జరిగినా.. తాజా సమాచారం ప్రకారం కథ మరింత విస్తృతమైన మిథలాజికల్ టచ్‌తో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. వారణాసి వంటి పవిత్ర నగరంలో బ్రహ్మ–విష్ణు–మహేశ్వరుల పాత్రలను చూపించడమే కాదు.. కథకు బలమైన ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కూడా జోడించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఓ కీలక అఘోరా క్యారెక్టర్ కూడా ఉంటుందని సమాచారం. ఆ పాత్ర కథలో టర్నింగ్ పాయింట్‌గా నిలవనుందని టాక్. అయితే ఆ అఘోరా పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది ప్రస్తుతానికి పూర్తిగా సస్పెన్స్‌గా ఉంచారు. స్టార్ నటుడా? లేక కొత్త ముఖమా? అన్న ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానం దొరకడం కష్టమే.
మహేశ్ బాబు కెరీర్‌లోనే ఇది అత్యంత విభిన్నమైన పాత్రగా నిలవనుందని, రాజమౌళి మార్క్ విజన్‌తో ఈ సినిమా ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనుందన్న నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. వారణాసి నేపథ్యం, మిథలాజికల్ ఎలిమెంట్స్, అఘోరా క్యారెక్టర్.. అన్ని కలిసి ఈ సినిమాను ఓ విజువల్ వండర్‌గా మార్చబోతున్నాయనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ ఎక్స్‌క్లూజివ్ లీక్ మాత్రం మహేశ్‌బాబు–రాజమౌళి సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన అప్డేట్స్ వస్తాయేమో చూడాలి.
వారణాసి చిత్రంలో గ్లోబల్ అడ్వెంచర్‌లో మహేష్ బాబు రుద్రగా కనిపించబోతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. ఇక మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర చేస్తున్నారు. ఈ ముగ్గురి పాత్రలకి సంబందించిన పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకున్నాయి. 2027లో వారణాసి సినిమా విడుదల కానుంది. సూపర్ స్టార్ అభిమానులి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.