SS Rajamouli: "ఆర్ఆర్ఆర్" కి సీక్వెల్ ఉండచ్చు అంటున్న రాజమౌళి..
* సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు
"ఆర్ ఆర్ ఆర్" కి సీక్వెల్ ఉండచ్చు అంటున్న రాజమౌళి
SS Rajamouli: "బాహుబలి" సినిమా తర్వాత మళ్లీ అదే స్థాయిలో "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో హిట్టు అందుకున్నారు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తాజాగా ఈ సినిమా జపాన్లో కూడా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా సీక్వెల్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు రాజమౌళి. సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కోరుకుంటున్నారని సినిమా క్లైమాక్స్ లో కూడా ఇద్దరూ బతికే ఉన్నట్లు చూపించారు కాబట్టి వారిద్దరు ఎలా స్వతంత్ర పోరాటం చేశారు అనే విషయం చూపిస్తే బాగుంటుందని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళికి ప్రశ్న ఎదురైంది.
దీంతో రాజమౌళి కూడా సినిమా కి సీక్వెల్ తీసే అభిప్రాయం ఉందని ఒక గొప్ప కారణం కోసం ఇద్దరు సూపర్ హీరోస్ కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అనేది సినిమా కాన్సెప్ట్ అలాంటి మరొక అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ దొరికితే కచ్చితంగా సినిమాకి సీక్వెల్ ప్రకటిస్తాను అని అన్నారు రాజమౌళి. మరి రైటర్ విజయేంద్ర ప్రసాద్ "ఆర్ ఆర్ ఆర్" సినిమా సీక్వెల్ కి సెట్ అయ్యేలాగా ఒక మంచి కథను ఎప్పుడు ఇస్తారో చూడాలి.