వీపు మీద కొట్టండి.. కడుపు మీద కొట్టకండి: బండ్ల గణేశ్

Producer Bandla Ganesh : తెలుగు సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Update: 2020-10-11 09:59 GMT

Bandla Ganesh 

Producer Bandla Ganesh : తెలుగు సినిమాల్లో కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు బండ్ల గణేష్.. . సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో మొదలగు చిత్రాలు నిర్మించాడు. ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ 2018 తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కానీ అతనికి టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2019లో తానూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు గణేష్!

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు బండ్ల గణేష్.. 'నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు' అంటూ గణేష్ ఇటీవల ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో గణేష్, పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాని చేయనునట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు వచ్చాయి.. అయితే ఇందులో తీన్ మార్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన గబ్బర్ సింగ్ మాత్రం భారీ వసూళ్లు సాధించి బండ్ల గణేష్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో తనపైన వస్తున్న వార్తల పైన బండ్ల గణేష్ స్పందించారు. వీపుమీద కొట్టండి .కానీ నీ దయ చేసి కడుపు మీద కొట్టకండి.. ఇది నా విన్నపం .నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన.. అంటూ ట్వీట్ చేశారు బండ్ల.. ఇక ఓ అభిమాని " మంచి డైరెక్టర్ ని చూడు అన్న హిట్ కొట్టాలి గబ్బర్ సింగ్ లా" అని కోరగా, 100% బ్రదర్ అంటూ సమాధానం ఇచ్చాడు బండ్ల గణేష్! 

Tags:    

Similar News