'నా బాస్ ఓకే చెప్పారు' .. పవన్ ఫ్యాన్స్ కి బండ్ల గుడ్ న్యూస్!

నా బాస్ ఓకే చెప్పారు .. పవన్ ఫ్యాన్స్ కి బండ్ల గుడ్ న్యూస్!
x

Bandla Ganesh, Pawan kalyan 

Highlights

Bandla Ganesh With Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంత వీరాభిమానియో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది

Bandla Ganesh With Pawan kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎంత వీరాభిమానియో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఆయన తాజాగా చేసిన ఓ ట్వీట్ పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. 'నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు' అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఇందులో పవన్ తో కలిసి దిగిన ఫోటోను గణేష్ పోస్ట్ చేశారు. దీనికంటే ముందు గణేష్ 'నా భవిష్యత్తు గురించి ఈ రోజు ఉదయం 11.23 గంటలకు ఓ అద్భుతమైన వార్తను చెబుతాను' అంటూ ట్వీట్' చేశారు. చూస్తుంటే పవన్ కళ్యాణ్ తో సినిమా ఒకే అయిందని తెలుస్తోంది.దీనికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్ రానుంది.


ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో ఇప్పటికే తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలను తెరకెక్కించారు. అయితే ఇందులో తీన్ మార్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన గబ్బర్ సింగ్ మాత్రం భారీ వసూళ్లు సాధించి బండ్ల గణేష్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మళ్లీ పవర్ స్టార్ తో ఓ సినిమాని చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. అటు ఈ ఏడాదితో గబ్బర్ సింగ్ చిత్రం ఎనమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బండ్ల గణేష్ తన ఇంట్లో హోమం నిర్వహించిన సంగతి తెలిసిందే..

ఇక అటు పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వచ్చేసరికి రెండేళ్ల రాజకీయం తరవాత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన రీఎంట్రీ మూవీగా బాలీవుడ్ లో మంచి హిట్ అయిన పింక్ సినిమాని వకీల్ సాబ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు బోణి కపూర్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ తరవాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యాడు పవన్..

Show Full Article
Print Article
Next Story
More Stories