Prasad Behera: వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన ప్రసాద్ బెహరా
Prasad Behera: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో యువ ప్రతిభ, కొత్త నటీనటుల హవా నడుస్తోంది.
Prasad Behera: వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిన ప్రసాద్ బెహరా
Prasad Behera: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో యువ ప్రతిభ, కొత్త నటీనటుల హవా నడుస్తోంది. నయా జమానా దర్శకులు, నిర్మాతలు ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ ప్రతిభను చాటుకుంటున్న యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఆర్టిస్టులను వెండితెరపైకి తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నారు.
ఈ క్రమంలో, యూట్యూబ్ వెబ్ సిరీస్‌ల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు వెండితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు.
'కమిటీ కుర్రోళ్లు' చిత్రంలో పెద్దోడి పాత్రలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రసాద్ బెహరా. ఆ చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాలతో అందరినీ కంటతడి పెట్టించాడు. ఆ తర్వాత, ఇటీవల విడుదలైన ‘మిత్ర మండలి’ సినిమాలో మాత్రం తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించాడు. ఇలా ప్రసాద్ బెహరా తాను పోషించే ప్రతి పాత్రతో ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేక ముద్ర వేస్తున్నాడు. ‘బ్యూటీ’, ‘బచ్చలమల్లి’, ‘విరాజి’ వంటి చిత్రాల్లోని ఆయన పాత్రలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
యూట్యూబ్‌లో ఆయన నటించిన ‘మా విడాకులు’, ‘పెళ్లివారమండి’ వంటి హిట్ వెబ్ సిరీస్‌లు ప్రసాద్‌కు పెద్ద ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టాయి. అదే ఉత్సాహంతో, అదే వేగంతో ఆయన ఇప్పుడు వెండితెరపై వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘పాపం ప్రతాప్’, ‘రోమియో జూలియట్’ చిత్రాల్లో ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అంతేకాకుండా, మరో మూడు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు యూట్యూబ్‌లో తన కామెడీతో అలరించిన ప్రసాద్ బెహరా, ఇప్పుడు వెండితెరపై దూసుకుపోతున్న బిజీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాడు.