Allu Arjun: వివాదంలో అల్లు అర్జున్.. లీగల్ యాక్షన్‌కు సిద్ధం!
Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'పుష్ప'తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు ఒక వివాదంలో నిలిచారు.
Allu Arjun: వివాదంలో అల్లు అర్జున్.. లీగల్ యాక్షన్‌కు సిద్ధం!
Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'పుష్ప'తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు ఒక వివాదంలో నిలిచారు. బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌లో పెద్ద దుమారమే రేపాయి.
కావేరీ బారువా ఆరోపణల ప్రకారం.. అల్లు అర్జున్‌తో ఒక యాడ్ షూటింగ్ చేయాలంటే ఏకంగా 42 రకాల ప్రోటోకాల్స్ పాటించాలట. హీరో కళ్లలోకి నేరుగా చూడకూడదని, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, హీరో సెట్‌లో ఉన్నప్పుడు ఫోన్ అస్సలు వాడకూడదని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, తాను ఫోన్ వాడుతుంటే బాడీగార్డ్ వచ్చి చేతిలో నుంచి ఫోన్‌ను లాగేసుకున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు బన్నీ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశాయి. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, హీరో వ్యక్తిత్వంపై చర్చ మొదలైంది.
బన్నీ టీమ్ పవర్‌ఫుల్ కౌంటర్
ఈ ఆరోపణలను అల్లు అర్జున్ టీమ్ ఏమాత్రం ఉపేక్షించలేదు. వెంటనే రంగంలోకి దిగి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కావేరీ బారువా చేసినవన్నీ నిరాధారమైన, అవాస్తవ ఆరోపణలు అని కొట్టిపారేసింది. అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తారని.. ఆయనతో పనిచేసిన ఎందరో డైరెక్టర్లు, టెక్నీషియన్లే దీనికి సాక్ష్యమని స్పష్టం చేసింది. కేవలం చౌకబారు ప్రచారం కోసమే ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
లీగల్ యాక్షన్ తప్పదా?
ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేలా లేదు అల్లు అర్జున్ టీమ్. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేయడానికి తమ లీగల్ టీమ్ సిద్ధంగా ఉందని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వాస్తవాలు తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదని పేర్కొంది.
సినిమా ఇండస్ట్రీలో స్టార్డమ్ పెరిగే కొద్దీ ఇలాంటి ఆరోపణలు రావడం సహజం. అయితే, ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడితే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని బన్నీ టీమ్ ఇచ్చిన రిప్లై ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదం ఇక్కడితో సర్దుమణుగుతుందా? లేక కావేరీ బారువా మళ్లీ స్పందిస్తారా? అన్నది వేచి చూడాలి.