Bandla Ganesh: ముగిసిన బండ్ల గణేష్ 'సంకల్ప యాత్ర': 500 కిలోమీటర్ల పాదయాత్రతో తిరుమలలో మొక్కు తీర్చుకున్న నటుడు!
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తిరుమలలో తన మొక్కును తీర్చుకున్నారు.
Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తిరుమలలో తన మొక్కును తీర్చుకున్నారు. గత ప్రభుత్వంలో అరెస్టైన సీఎం చంద్రబాబు క్షేమంగా విడుదలవ్వాలని కోరుకుంటూ ఆయన చేపట్టిన సంకల్ప యాత్ర ఈరోజు తిరుపతికి చేరుకుంది. జనవరి 19న హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ యాత్ర.. దాదాపు 500 కిలోమీటర్లకు పైగా సాగి ఈ ఉదయం అలిపిరి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి, బండ్ల గణేష్ కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు.
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ యాత్రలో పాల్గొని బండ్ల గణేష్‌కు మద్దతు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు.. ఆయన క్షేమంగా బయటకు రావాలని శ్రీవారిని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. ఆ మొక్కు నెరవేరడమే కాకుండా, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో.. తన భక్తిని చాటుకుంటూ ఈ సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశారు. చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న బండ్ల గణేష్‌ను టీడీపీ శ్రేణులు ఘనంగా సత్కరించాయి.