Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ను ఢీకొట్టే 'నల్ల నాగప్ప' వచ్చేశాడు..!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది! హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి చిత్ర బృందం ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది.

Update: 2026-02-12 04:40 GMT

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌ను ఢీకొట్టే 'నల్ల నాగప్ప' వచ్చేశాడు..!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది! హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి చిత్ర బృందం ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఈ సినిమాలో ఉస్తాద్‌ను ఢీకొట్టబోయే ఆ పవర్‌ఫుల్ విలన్ ఎవరో రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఏ సినిమాలోనైనా హీరో ఎలివేషన్ పీక్స్‌లో ఉండాలంటే.. విలన్ పాత్ర అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెర్సటైల్ యాక్టర్, తమిళ విలక్షణ నటుడు పార్తీబన్‌ను రంగంలోకి దింపారు. ఈ సినిమాలో ఆయన 'నల్ల నాగప్ప' అనే అత్యంత భయంకరమైన పాత్రలో కనిపించబోతున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పార్తీబన్ లుక్ అదిరిపోయింది. ఒక భారీ బంగ్లాలో, నల్లటి కళ్లద్దాలు పెట్టుకుని, ఒక ఇంటి పెద్దగా కనిపిస్తూనే.. కళ్లలో క్రూరత్వాన్ని పలికిస్తున్నారు. "గబ్బర్ సింగ్" లో సిద్ధప్ప నాయుడు పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో, ఇప్పుడు 'నల్ల నాగప్ప' అంతకంటే పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఒక స్పెషల్ రోల్‌లో మెరవనున్నారు.'రాక్ స్టార్' దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన పాటలు ఇండస్ట్రీని ఊపేశాయి.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సమ్మర్ కానుకగా మార్చి 26వ తేదీన ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద వేటాడటానికి సిద్ధంగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఖాకీ డ్రెస్ వేసి పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో మేనరిజమ్స్ చూపిస్తుంటే.. థియేటర్లలో ఈలలు, గోలలు ఖాయం.





Tags:    

Similar News