అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీ.. ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఫైనల్?

విక్టరీ వెంకటేష్ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జోడీ టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా మారింది.

Update: 2026-02-10 12:09 GMT

అనిల్ రావిపూడి-వెంకటేష్ మూవీ.. ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఫైనల్?

విక్టరీ వెంకటేష్ – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జోడీ టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా మారింది. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. అనిల్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన 'మన శంకర వరప్రసాద్'లో కూడా వెంకీ మామ కీలక పాత్రలో మెరిశారు. హిట్ కాంబో వెంకీ-అనిల్ కలిసి మరోసారి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఈ కాంబోలో రాబోయే కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

బుట్టబొమ్మ, మహానటి ఫైనలా:

హిట్ జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి.. వెంకీ సినిమాను జూన్–జులై నెలల్లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కథ, నటీనటుల ఎంపిక దశలోనే ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా టాక్ ప్రకారం.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వెంకటేష్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే, మహానటి కీర్తీ సురేష్ నటించనున్నట్లు సమాచారం. కథలో కీలకమైన పాత్రల కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బుట్టబొమ్మ, మహానటి కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే.. ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు.

ఫహాద్ ఫాజిల్ ఎంట్రీ:

ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ సినిమాలో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా అదరగొట్టిన ఫహాద్.. ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. కథ ప్రకారం ఆయన వెంకటేష్ తమ్ముడి పాత్రలో కనిపించనున్నట్టు టాక్. ఫహాద్ జోడిగా హాట్ భామ ఆషికా రంగనాథ్ ఎంపిక అయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం మీద ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్:

అనిల్ రావిపూడి సినిమా అంటేనే.. వినోదం, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు పర్ఫెక్ట్ బ్యాలెన్స్. వెంకటేష్‌తో చేయనున్న ఈ కొత్త సినిమా కూడా అదే ఫార్మాట్‌లో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటివరకు ఈ క్రేజీ కాంబోపై బజ్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News