Udit Narayan: గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై సంచలన కేసు: ‘నాకు తెలియకుండానే ఆపరేషన్ చేయించారు’.. మొదటి భార్య ఫిర్యాదు!

Udit Narayan: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2026-02-12 07:18 GMT

Udit Narayan: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మొదటి భార్య రంజన ఝా చేసిన ఆరోపణలు ఇప్పుడు సంగీత ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన రెండో భార్య దీపా నారాయణ్, మరియు ఇద్దరు సోదరులపై రంజన బీహార్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రంజన ఝా తన ఫిర్యాదులో ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. 1996లో వైద్య పరీక్షల పేరుతో ఉదిత్ నారాయణ్ మరియు కుటుంబ సభ్యులు తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండానే తన గర్భాశయాన్ని (Uterus) తొలగింపజేశారని ఆమె ఆరోపించారు. దశాబ్దాలు గడిచినప్పటికీ, తనకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు న్యాయం కావాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. రంజన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఉదిత్ నారాయణ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గత ఏడాది ఒక లైవ్ కాన్సర్ట్‌లో ఫోటో అడిగిన మహిళా అభిమానిని ఆయన ముద్దుపెట్టుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. అప్పట్లో ఆయన తన ప్రవర్తనను సమర్థించుకున్నప్పటికీ, తాజాగా భార్య చేసిన క్రిమినల్ ఆరోపణలు ఆయన ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.

ఇటీవల తెలుగులో చిరంజీవి చిత్రం 'విశ్వంభర' (మన శంకర వరప్రసాద్ గారు) లోని 'మీసాల పిల్లా..' అనే పాటతో అలరించిన ఉదిత్ నారాయణ్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోని ఈ చట్టపరమైన చిక్కుల వల్ల వార్తల్లో నిలిచారు.

Tags:    

Similar News