Lavanya Tripathi: గర్భంతో ఉన్నప్పుడే ఆ సినిమా పూర్తి చేశా.. ‘సతీ లీలావతి’ విశేషాలు పంచుకున్న లావణ్య త్రిపాఠి!
Lavanya Tripathi: టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’.
Lavanya Tripathi: టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 6న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.
ఈ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. "సతీ లీలావతి షూటింగ్ ప్రారంభమైనప్పుడు నేను గర్భవతిని. దర్శకుడు, నిర్మాతలు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే కేవలం మూడు నెలల్లోనే నా పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేయగలిగాను. ఇది ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. దేవ్ మోహన్ నటన, సప్తగిరి కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి" అని ఆమె పేర్కొన్నారు.
దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ.. గతంలో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ చిత్రం ‘సతీ లీలావతి’ టైటిల్ పెట్టినప్పటికీ, ఆ సినిమాతో దీనికి పోలిక ఉండదని స్పష్టం చేశారు. నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.
నటుడు సప్తగిరి ఈ చిత్రంపై ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత నాగ మోహన్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషమని, దర్శకుడు సత్య తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఘన విజయం అందుకుంటారని ఆకాంక్షించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.