Irumudi: 'ఇరుముడి' ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదా? ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

Irumudi: దర్శకుడు శివ నిర్వాణ అంటేనే ఎమోషన్స్‌ను వెండితెరపై పండించడంలో దిట్ట. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాలతో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన ఈ డైరెక్టర్, ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో 'ఇరుముడి' అనే ప్రయోగాత్మక సినిమాకు శ్రీకారం చుట్టారు.

Update: 2026-02-11 05:24 GMT

Irumudi: 'ఇరుముడి' ఫస్ట్ ఛాయిస్ రవితేజ కాదా? ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

Irumudi: దర్శకుడు శివ నిర్వాణ అంటేనే ఎమోషన్స్‌ను వెండితెరపై పండించడంలో దిట్ట. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సినిమాలతో ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన ఈ డైరెక్టర్, ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో 'ఇరుముడి' అనే ప్రయోగాత్మక సినిమాకు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి ఫిల్మ్ నగర్‌లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ కథను శివ నిర్వాణ మొదటగా అక్కినేని నాగచైతన్యకు వినిపించారట. 'మజిలీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోపై అంచనాలు భారీగా ఉండటంతో చైతూ కూడా కథకు ఇంప్రెస్ అయ్యారు. కానీ, అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టుల వల్లనో లేక నిర్ణయం తీసుకోవడంలో జరిగిన జాప్యం వల్లనో చైతూ కాస్త ఆలస్యం చేశారు. అయితే, నిర్మాతలు (మైత్రీ మూవీ మేకర్స్) ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావించడంతో, ఈ కథ రవితేజ చెంతకు చేరింది. కథ విన్న మరుక్షణమే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 'ఇరుముడి' ప్రయాణం మొదలైంది.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. తల మీద ఇరుముడి, మరో చేత్తో చిన్నారి పాపను ఎత్తుకుని రవితేజ కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఇదొక బాధ్యతాయుతమైన తండ్రి ప్రయాణమని అర్థమవుతోంది. "Every Emotion is a Celebration" అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని డెప్త్‌ను సూచిస్తోంది. అయ్యప్ప స్వామి నేపథ్యం, తండ్రి-కూతురు సెంటిమెంట్, యాక్షన్ కలగలిసిన ఈ చిత్రం మలయాళ హిట్ 'మాలికాపురం'కి రీమేక్ అనే ప్రచారం కూడా జరుగుతోంది.

నాగచైతన్య లాంటి క్లాస్ హీరో చేయాల్సిన సినిమా, రవితేజ లాంటి మాస్ హీరో వద్దకు రావడం సినిమా జానర్‌నే మార్చేస్తుంది. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం, ఒక మంచి సక్సెస్‌ను చైతూ చేజేతులా జారవిడుచుకున్నాడనే ఫీలింగ్ అక్కినేని అభిమానుల్లో కలగడం ఖాయం. శివ నిర్వాణకు ఇది కంబ్యాక్ సినిమా కాగా, రవితేజకు తన ఇమేజ్‌ను మార్చుకునే వినూత్న ప్రయత్నం. మరి ఈ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News