Mahesh Babu : చిన్న సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు..హీరోయిన్ షాకింగ్ రియాక్షన్

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా గురించి ట్వీట్ చేశారంటే, ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మహేష్, తాజాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు.

Update: 2026-02-12 04:56 GMT

Mahesh Babu : చిన్న సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు..హీరోయిన్ షాకింగ్ రియాక్షన్

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా గురించి ట్వీట్ చేశారంటే, ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మహేష్, తాజాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. దీనిపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది.

గుణశేఖర్ మేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన విజువల్స్ ఎప్పుడూ గ్రాండ్‌గా ఉంటాయి. తాజాగా విడుదలైన 'యుఫోరియా' సినిమాను చూసిన మహేష్ బాబు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిత్ర బృందాన్ని అభినందించారు.

మహేష్ బాబు ఏమన్నారంటే..

గుణశేఖర్ గారు తన కథలను ప్రెజెంట్ చేయడంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తారు. ‘యుఫోరియా’ సినిమాను నేను బాగా ఎంజాయ్‌ చేశా. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదొక మస్ట్ వాచ్ మూవీ. గుణశేఖర్ గారికి, భూమిక గారికి మరియు చిత్ర బృందానికి నా అభినందనలు.

సూపర్ స్టార్‌కు థాంక్స్ చెప్పిన సారా అర్జున్

మహేష్ బాబు ప్రశంసలపై ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ సారా అర్జున్ ఎమోషనల్ అవుతూ స్పందించింది. సూపర్ స్టార్ నుంచి వచ్చిన ఈ కాంప్లిమెంట్ తమ టీమ్ మొత్తానికి పెద్ద బూస్ట్ ఇచ్చిందని సారా పేర్కొంది. మీలాంటి సూపర్ స్టార్ నుంచి ప్రశంసలు అందుకోవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం.మహేష్ బాబు తదుపరి భారీ చిత్రం ‘వారణాసి’ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సారా తన పోస్ట్‌లో పేర్కొంది.

నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ చిత్రంలో భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. యూత్ ఫుల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. గతంలో ‘ఒక్కడు’, ‘అర్జున్’ వంటి బ్లాక్ బస్టర్లను అందించిన గుణశేఖర్-మహేష్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందుకే గుణశేఖర్ సినిమాను మహేష్ మెచ్చుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.



Tags:    

Similar News