Pavan Kalyan Vakeel Saab look leaked: వకీల్ సాబ్ నుంచి పవన్ లుక్ లీక్..

Pavan Kalyan Vakeel Saab look leaked: అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2020-06-29 06:03 GMT

 Pavan Kalyan Vakeel saab look leaked:అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. పవన్ రీఎంట్రీ మూవీగా వకీల్ సబ్ అనే సినిమా తెరకెక్కుతుంది.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్.. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.. పవన్ కళ్యాణ్ తో పాటుగా అనన్య పాండే, అంజలి, నివేధా థామస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు..

అయితే ఈ సినిమాలో నుంచి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ లుక్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. పవన్ కళ్యాణ్ కోర్టులో లాయర్ గా జడ్జితో వాదిస్తున్న సన్నివేశానికి సంబంధించిన పిక్ లీక్ అయింది. ఈ పిక్ లో పవన్ తో పాటుగా అంజలి కూడా పక్కన కనిపిస్తుంది. అయితే ఈ పిక్ ఎలా లీక్ అయింది అన్నదానిపై ఇప్పుడు నిర్మాతలు ఆరా తీస్తున్నారు.. ఇదేం మొదటిసారి కాదు.. సినిమా షూటింగ్ మొదట్లో షూటింగ్ లో గుబురు గడ్డంతో సెట్ లో ఉన్న పవన్ లుక్ కూడా అప్పుడు లీక్ అయి వైరల్ గా మారింది.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్, దిల్ రాజులు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులలో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి..

ఇక ఈ సినిమా తరవాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని ఇప్పటికే మొదలు పెట్టేశాడు పవన్.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు పవన్..పూరి జగన్నాథ్ , త్రివిక్రమ్ డైరెక్షన్ లలో కూడా పవన్ ఓ సినిమా చేయనున్నారని సమాచారం.

Tags:    

Similar News