'వకీల్‌సాబ్‌' టైటిల్‌ అలా పెట్టలేదు.. పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు

వకీల్‌సాబ్‌ టైటిల్‌ అలా పెట్టలేదు.. పరుచూరి ఆసక్తికర వ్యాఖ్యలు
x
Paruchuri Gopala Krishna (File photo)
Highlights

పవన్‌కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ మూవీ రీమేక్‌గా ఈ సినిమా రాబోతోంది.

పవన్‌కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన 'పింక్‌' మూవీ రీమేక్‌గా ఈ సినిమా రాబోతోంది. కాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వకీల్ సాబ్ టైటిల్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో ఏం టైటిల్‌ పెడతారా? అని ఎదురు చూశా. పవన్ కళ్యాణ్ తన పేరుపై టైటిల్స్ పెట్టలేదు గొప్ప విషయం. 'జల్సా', 'అత్తారింటికి దారేది', ఇలాంటి టైటిల్స్‌ ఏవీ తన మీద రాలేదు. ఆయన కూడా కోరుకోరు. చాలా కాలం తర్వాత పవన్ సినిమా చేస్తున్నారు. పింక్ టైటిల్ తెలుగులో ఎం పెడతారా? అని ఆసక్తిగా ఎదురు చూశా. 'వకీల్‌సాబ్‌' సూపర్‌ టైటిల్‌.

పాత రోజుల్లో సినిమాలకు పేరు కలిసేలా 'లాయర్‌ విశ్వనాథ్', 'లాయర్‌ భారతీదేవి' ఇలా ఏదో పెడతారని అనుకున్నా. అలా పెట్టలేదు. ఈ టైటిల్‌ ఆలోచన వచ్చిన వాళ్లకు హ్యాట్సాఫ్‌ అని పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న 'వకీల్‌సాబ్‌' మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఆటంకం ఏర్పడి విడుదల వాయిదా పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories