బాలకృష్ణను కృంగదీసిన తారకరత్న మరణం
*తారకరత్న మృతితో విషాదంలో మునిగిపోయిన బాలకృష్ణ
బాలకృష్ణను కృంగదీసిన తారకరత్న మరణం
Balakrishna: 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న నిన్న ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. దీంతో నందమూరి ఇంట మరొకసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తారకరత్న మరణం తో నందమూరి బాలకృష్ణ కూడా బాగా కృంగిపోతున్నారని తెలుస్తోంది. నిజానికి తన అన్న తనయుడైన తారకరత్న అంటే బాలకృష్ణకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మిగతా వారితో పోలిస్తే బాలయ్య తారకరత్న పై ప్రత్యేక ఇష్టాన్ని చూపించేవారు.
అసలు తారకరత్న అని బలవంతం చేసి మరి ఈ సినిమాల్లోకి తీసుకువచ్చింది బాలకృష్ణ. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా మారారు తారకరత్న. ఆ తర్వాత "యువరత్న", "తారక్", "భద్రాద్రి రాముడు", "అమరావతి", "నందీశ్వరుడు" ఇలా చాలానే సినిమాల్లో నటించారు తారకరత్న. తారకరత్న హీరోగా మారడానికి మాత్రమే కాక వరుస పెట్టి సినిమాలు చేయడానికి కూడా బాలకృష్ణ ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. కానీ మూడు వారాల క్రితం తారకరత్న "యువ గళం" పాదయాత్రలో తారకరత్న హార్ట్ స్ట్రోక్ తో పడిపోయినప్పటి నుంచి బాలకృష్ణ చాలా కంగారు పడిపోయారు.
తారకరత్న హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు కూడా బాలకృష్ణ దగ్గర ఉండి అన్ని పనులు చూసుకున్నారు. తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని, తను మళ్ళీ లేచి తిరగాలని బాలకృష్ణ ఎన్నో హోమాలు మరియు యాగాలు కూడా చేయించారు. కానీ మళ్లీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించి నిన్న కనుమూయడం బాలకృష్ణ ను బాగా కలచివేసింది. తారకరత్న ఇకలేరు అనే విషయాన్ని నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.