Naga Chaitanya: ఆ డైరెక్టర్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..
Custody: "థాంక్యూ" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన అక్కినేని నాగచైతన్య తాజాగా ఇప్పుడు "కస్టడీ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
Naga Chaitanya: ఆ డైరెక్టర్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..
Custody: "థాంక్యూ" సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన అక్కినేని నాగచైతన్య తాజాగా ఇప్పుడు "కస్టడీ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా త్వరలో విడుదల కు సిద్ధమవుతోంది. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఆయన 'కస్టడీ' మూవీతోపాటు దర్శకుడు పరశురామ్‌తో తలెత్తిన వివాదంపై ఆయన పెదవివిప్పారు. పరశురామ్‌తో ఉన్న సమస్యలపై స్పందించమని విలేకరి కోరగా.. నాగచైతన్య చెప్తూ...పరశురామ్ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్.. అతను నా టైమ్ వేస్ట్ చేసాడు. ఈ టాపిక్ మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు అని నాగచైతన్య తేల్చి చెప్పేసారు.
'గీతగోవిందం' సక్సెస్ తర్వాత పరశురామ్.. నాగచైతన్యతో 'నాగేశ్వరరావు' అనే సినిమా చేయాలనుకున్నాడు. ఓ మంచి రోజున ఇది పట్టాలెక్కుతుందని సినీ ప్రియులు ఎదురుచూశారు. అయితే, అనుకోని కారణాలతో ఆదిలోనే ఇది ఆగిపోయింది.