My Village Show Gangavva in Big boss 4: బిగ్ బాస్ 4 విలేజ్ సెలబ్రిటీ గంగవ్వ?

My Village Show Gangavva in Big boss 4: బిగ్ బాస్ అంటేనే ఎప్పటికప్పుడు ఓ సంచలనం. వందరోజుల పాటు రియాల్టీషోల అభిమానులకు వినోదాల విందు. ఇక బిగ్ బాస్ 4 సీజన్ తెలుగులో మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది.

Update: 2020-08-21 06:44 GMT

 GANGAVVA IN BIG బాస్: 

My Village Show Gangavva in Big boss 4: బిగ్ బాస్ అంటేనే ఎప్పటికప్పుడు ఓ సంచలనం. వందరోజుల పాటు రియాల్టీషోల అభిమానులకు వినోదాల విందు. ఇక బిగ్ బాస్ 4 సీజన్ తెలుగులో మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున రెడీ అయిపోయారు. అప్పుడే ప్రోమోలతో దుమ్ములేపారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోతో కేక పుట్టించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళతారనే విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే కొన్ని పేర్లు లీకయి వైరల్ అయ్యాయి.

కరోనా మహమ్మారి కారణంగా రియాల్టీ షో నిర్వహణ కష్టమైనా సరే నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుని షో నిర్వహణకు సిద్ధం అయిపోయారు. ఇప్పటికే హోస్ లో ఉండబోయే సెలబ్రిటీలు బిగ్ బాస్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ అంటే.. టాస్క్ లు.. పోటీలు.. తప్పనిసరి. అయితే కరోనా కారణంగా ఈసారి బిగ్ బాస్ ను కొద్దిగా వినూత్నంగా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండడంతో టాస్క్ లలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు అనుకుంటున్నారు. ఎక్కువగా మైండ్ గేమ్స్ ఉండేలా.. మాటలతో హౌస్ దద్దరిల్లిపోయే రచ్చ చేసేలా టాస్క్ లు ఉండబోతున్నాయని వినిపిస్తోంది.

ఇందులో భాగంగా ఓ సంచలనం చేయబోతున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. విలేజ్ సెలబ్రిటీ.. యూ ట్యూబ్ విలేజ్ స్టార్.. మై విలేజ్ షో గంగవ్వను హౌస్ లోకి పంపిస్తున్నారని తెలుస్తోంది. గంగవ్వ అంటే తెలుసుకదా ఊరి బాసలో మహా మాస్.. తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంత పెద్ద వయసులోనూ తన వీడియోలతో యూ ట్యూబ్ ను షేక్ చేసింది గంగవ్వ. ఇప్పుడు గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడితే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ మాటల మంత్రికురాలు బిగ్ బాస్ హౌస్ లో చేయబోయే సందడి ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. గంగావ్వ కోసం ప్రత్యేకంగా మాటల ఆటల్ని డిజైన్ చేస్తున్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇదే కనుక నిజమైతే గంగవ్వ బిగ్ బాస్ లో అడుగు పెడితే కొత్తదనం వస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.

మీకోసం మంగవ్వ వీడియో ఒకటి చూసేయండి.. మీరే అంటారు బిగ్ బాస్ లో అవ్వ వస్తే అదిరిపోతుంది అని..

...యూ ట్యూబ్ లింక్..

Full View

Tags:    

Similar News