Bigg Boss 4: నాగార్జున 'తీన్' మార్ షో.. అబ్బో..'బిగ్ బాస్' లో మళ్ళీ 'మనం' చూపించేస్తున్నారుగా!

Bigg Boss 4: నాగార్జున తీన్ మార్ షో.. అబ్బో..బిగ్ బాస్ లో మళ్ళీ మనం చూపించేస్తున్నారుగా!
x
Nagarjuna Bigg Boss Host
Highlights

Bigg Boss 4: నాగార్జున త్రిపాత్రాభినయంతో బిగ్ బాస్ 4 ప్రోమో.. నాగ్ ఆదరగొట్టేశారుగా! ఒక ఇంట్లో కొంత మంది..

Bigg Boss 4: నాగార్జున త్రిపాత్రాభినయంతో బిగ్ బాస్ 4 ప్రోమో.. నాగ్ ఆదరగొట్టేశారుగా! ఒక ఇంట్లో కొంత మంది.. వంద రోజుల పాటు.. ప్రపంచంతో పనిలేకుండా.. మధ్య మధ్యలో ఒక అతిధి వాళ్ళెం చేస్తున్నారో.. ఏం చేయాలో చెప్పడానికి.. మొత్తం ప్రత్యక్ష ప్రసారం.. స్థూలంగా ఇదీ బిగ్ బాస్! ట్రోలింగ్లూ.. విమర్శలు.. వీటితో పనిలేని వినోదం! మూడు సీజన్లు తెలుగులో ఆదరగోట్టేశాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కి రంగం సిద్ధం అయింది. అతి త్వరలో బిగ్ బాస్ 4 మన ముందుకు రాబోతోంది. మరి బిగ్ బాస్ అంటేనే సందడి.. హోస్ట్ చేసే హడావుడి కదా. ఇక అది ప్రారంభం కాబోతోంది అంటే టీజర్లు.. ట్రైలర్లు మొదలవుతాయి కదా..

ఈ బిగ్ బాస్ 4 కి కింగ్ నాగార్జున హోస్ట్ అని ఎప్పుడో కన్ఫర్మ్ అయిపొయింది. ఇక కంటెస్టంట్ లు ఎవరనేది తేలాల్సి ఉంది. అదీ త్వరలోనే తేలిపోతుంది లెండి. అయితే, ఈలోపు మీ వినోదానికి నాదీ గ్యారంటీ అంటూ నాగార్జున సరికొత్త టీజర్ తో సందడి చేశారు. ఒక తాత మనవడు.. టెలిస్కోప్ వేసుకుని పక్కింటిలో విశేషాలు చూస్తుంటారు. తండ్రి వచ్చి ఏం చేస్తున్నారు అంటాడు.. అబ్బే ఏమీ లేదు వినోదం కోసం పక్కింటి విశేషాలు తెలుసుకున్తున్నాం అంటూ చెబుతారు తాతా మనవడు.

''మైడియర్ ఇంటి సభ్యుల్లారా.. ఇంతకంటే బెటర్ ఎంటర్ టైన్మెంట్ నేను చూపిస్తా.. తీయండి రిమోట్‌లు ఫిక్స్ అవ్వండి బిగ్ బాస్.. నిజమైన ఎమోషన్స్, అసలైన ఎంటర్ టైన్మెంట్.. ఇక్కడంతా లైవ్'' అంటూ తండ్రి సందడి చేస్తారు. ఈ పాటికి అర్ధం అయిందా ఈ మూడుతరాల మన్మధుడు ఎవరో.. ఎస్.. నాగార్జున మూడు పాత్రలతో.. మనం సినిమాని పోలిన లైన్ తో బిగ్ బాస్ 4 కోసం ప్రోమోలో కనిపించారు.

ఇప్పుడు మా టీవీ విడుదల చేసిన బిగ్ బాస్ 4 ప్రోమో 1.16 నిమిషాల నిడివితో ఆకట్టుకునేలా రూపొందింది. సరికొత్త కాన్సెప్ట్ తో కనిపిస్తున్న ఈ ప్రోమో బిగ్ బాస్ 4 పై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. అన్నట్టు బిగ్ బాస్ 4 ఎప్పట్నుంచో ఇంకా అఫీషియల్ గా తెలీదు కానీ, వినవస్తున్న సమాచారం ప్రకారం ఈ నెలచివరిలో అంటే 28 లేదా 29 తేదీల్లో మొదలవుతుందని తెలుస్తోంది. అసలు కంటె కొసరు ముద్దు కదా.. ప్రస్తుతానికే ఈ ప్రోమో చూసేయండి. కచ్చితంగా మీరూ ఇది చాలా బావుంది అంటారు..



Show Full Article
Print Article
Next Story
More Stories