Top
logo

Bigg boss 4 Telugu contestants: బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లో ఆడుకోబోయేది వీరే!

Bigg boss 4 Telugu contestants: బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లో ఆడుకోబోయేది వీరే!
X
bigg boss 4 Telugu contestants
Highlights

bigg boss 4 Telugu contestants: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో పాల్గొన బోతున్న సెలబ్రిటీలు వీరే!

బిగ్ బాస్ సీజన్ 4 సందడి మొదలయినట్టే. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. ఇక అసలు షో మొదలవడానికి వేగంగా రంగం సిద్ధం అయిపోతోంది. కరోనా నేపధ్యంలో అసలు ఈ బిగ్ బాస్ సీజన్ నడుస్తుందా ఆగుతుందా అనుకుంటూ వచ్చారు. కానీ.. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ షో నడిపించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. నాగార్జున ఇటీవల మూడు పాత్రల్లో కనిపించిన బిగ్ బాస్ 4 ప్రోమో తరువాత కచ్చితంగా షో మొదలవుతున్న సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. అంతే కాదు ఈ నెలాఖరులో (అందుతున్న సమాచారం ప్రకారం..ఈ నెల 29, 30 తేదీల్లో) బిగ్ బాస్ 4 మొదలయ్యే అవకాశం ఉంది.

బిగ్ బాస్ 4 కి హోస్ట్ గా ఎవరు వస్తారనే అంశంలో చాలా పేర్లు చక్కర్లు కొట్టాయి.. చిరంజీవి, రమ్యకృష్ణ ఇలా ఆఖరుకు విజయ్ దేవరకొండ కూడా ఈ షోకి హోస్ట్ గా రాబోతున్నరనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, అన్నిటికీ చెక్ పెడుతూ నాగార్జున మళ్ళీ హోస్ట్ గా ప్రత్యక్షం అయిపోయారు. ఇక షో లో పాల్గొనేది ఎవరనేది ఇప్పుడు అందరి మదిలోనూ కదులుతున్న పెద్ద ప్రశ్న.

ఈ కంటెస్టంట్ ల విషయంలోనూ చాలా మంది పేర్లూ నేట్టింట షికారు చేశాయి. ఈ సీజన్ మొదటి మూడు సీజన్ ల కంటె భిన్నంగా ఉండబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అవును మరి కచ్చితంగా భిన్నంగా ఉండే చాన్స్ ఉంది ఎందుకంటే మొదటి మూడు సీజన్లకు ఇప్పటికీ తేడా ఒక్కటే.. అది కరోనా! వంద రోజుల పాటు ఒకే ఇంట్లో కొంత మంది ఉండాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ముందు సీజన్ల లా ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే, ఇందులో పాల్గోబోయే వారెవరన్నది ప్రస్తుత విషయం.

కచ్చితంగా అందిన సమాచారం ప్రకారం..ఈసారి బిగ్ బాస్ లో 16 మంది ఉండబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉంది. ఈ పదహారు మంది ఎవరనే విషయంలో భిన్న ప్రచారాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 30 పేర్లకు పైగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వీరిలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోయేది పదహారు మంది లిస్టు ఇక్కడ ఇస్తున్నాం. దాదాపుగా (ఏదన్నా అనుకోని పరిస్థితులు ఏర్పడితే తప్ప) వీరిలో రెండు జంటలు ఉన్నాయి. (బిగ్ బాస్ 3లో ఒక్క జంట వరుణ్ సందేశ్..వితిక ఉన్నారు) ఇక ప్రస్తుత సీజన్ లో వీరే హౌస్ లో సందడి చేయబోతున్నారు. వారేవారంటే..

- మొదటి జంట..డాన్స్ మాస్టర్ రఘు - గాయని ప్రణవి.. వీళ్ళిద్దరూ బిగ్ బాస్ 4 కి స్పెషల్ ఎట్రాక్షన్

- రెండో జంట.. డియో సెలబ్రిటీ జాహ్నవి అలియాస్ మహాతల్లి… ఆమె భర్త సుశాంత్

- డాన్సర్ మెహబూబ్ దిల్‌సే.. ఈయన కూడా వెబ్ సెలబ్రిటీయే..

- గోదావరిఖని కుర్రోడు..వెబ్ సీరియళ్ళు.. సినిమాల్లో మెరుస్తున్న సొహైల్ రియాన్

- హెచ్‌ఎంటీవీలో జోర్దార్ వార్తలు చదివే సుజాత(అసలు పేరు ప్రతికాంతం శ్రుతి) ఈమె తెలంగాణా యాసలో వార్తలు అదరగొట్టేస్తుంది. మరి బిగ్ బాస్ లో ఎలా నెగ్గుకొస్తుందో?

- ఆ మధ్య రాం గోపాల్ వర్మ కామెంట్లు చేసిన యాంకర్ గుర్తున్నారా.. ఆమేనండీ.. అరియానా గ్లోరీ..టిక్ టాక్ స్టార్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేయడంలో స్పెషలిస్ట్.

- అందరికీ తెల్సిన ఫేమస్ పర్సనాలిటీ.. కరాటే కల్యాణి

- ఫేమస్ యాంకర్ లాస్య..

- యాక్టర్ నందు.. సింగర్ గీతా మాధురి భర్త ఈసారి సందడి చేయనున్నారు..

- బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ జిగరీ దోస్త్ యాక్టర్ నోయల్..

- జెమిని యాంకర్ ప్రశాంతి…

- ఇక జబర్దాస్ట్ నుంచి ఇద్దరి పేర్లు ఉన్నాయి ఒకరు రాం ప్రసాద్.. రెండు అవినాష్ వీల్లిద్దరులో ఒకరు కచ్చితంగా షోలో ఉంటారు.

దాదాపుగా వీళ్ళే బిగ్ బాస్ 4 హౌస్ లో నూరు రోజుల పాటు అభిమానులను అలరించబోయేది. అయితే, ఈసారి కరోనా ఉపద్రవ నేపధ్యంలో హౌస్ లో ఉండబోయే వారందరినీ 14 రోజుల ముందుగానే క్వారంటైన్ చేస్తున్నారు. వీరిలో ఎవరికైనా ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తితే వారికి ప్రత్యామ్నాయంగా మరో నలుగురిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Web TitleBigg boss 4 Telugu contestants list leaked and Bigg Boss 4 telugu season starting date
Next Story