సీనియర్ హీరోతో స్లిమ్ బ్యూటీ రోమాన్స్!

సీనియర్ హీరోతో స్లిమ్ బ్యూటీ రోమాన్స్!
x
Highlights

నడుము అందాలకు పెట్టిన పేరు ఇలియానా. వైవిఎస్ చౌదరి పరిచయం చేసిన అందం ఇలియానా.

నడుము అందాలకు పెట్టిన పేరు ఇలియానా. వైవిఎస్ చౌదరి పరిచయం చేసిన అందం ఇలియానా. దేవదాస్ మూవీతో కుర్రకారును పోకిరిలను చేసి.. యూత్‌తో జల్సా చేయించింది. ఆ తరువాత టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది. తెలుగులో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి నటిగా వార్తల్లోకి ఎక్కింది. టాలీవుడ్‌లో అంత క్రేజ్ ఉన్న సమయంలో బాలీవుడ్ బాట పట్టింది ఈ స్లిమ్ బ్యూటీ.

అయితే బాలీవుడ్‌అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. ఇక ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో.. చాటింగ్, డేటింగ్ అంటూ రచ్చ రచ్చ చేసి.. చివరకు బ్రేకప్ చెప్పేసింది. దీంతో ఆమె కన్ను మరోసారి టాలీవుడ్‌పై పడింది. ఈ క్రమంలోనే ఇటీవలే 'అమర్ అక్బర్ ఆంటోనీ' మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. దీంతో సీనియర్ హీరోలకు ఈ భామ బెటర్ ఛాయిస్ అనే టాక్ బలపడింది. ఇదే కోణంలో ఆలోచించిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.. ఆమెతో మూవీ చేయటానికి సంప్రదింపులు చేస్తున్నట్లు టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో అజయ్ దేవగన్, ఇలియానా నటించిన 'రైడ్' మూవీని టాలీవుడ్‌లో రీమేక్ చేయాలనుకుంటున్నారట ప్రవీణ్. 'కింగ్' నాగార్జున హీరోగా ఈ మూవీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే నాగ్ సరసన ఇలియానా అయితే.. న్యాయం జరుగుతుందని భావించిన ప్రవీణ్.. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారనే టాక్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక నాగ్‌తో రొమాన్స్ చేసి ఇక్కడి కుర్రకారులను.. మరోసారి తన నడుము అందాలతో ఇలియానా మత్తెక్కిస్తుందో లేదో చూడాలి మరి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories