విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున.. కాసేపట్లో ఏపీ సీఎంను కలవనున్న నటులు

అనుకున్న విధంగానే ఏపీ సీఎం జగన్మోహనరెడ్డిని కలిసేందుకు సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు మిగిలిన బృందం ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు.

admin1
Updated on: 9 Jun 2020 1:22 PM IST
విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున.. కాసేపట్లో ఏపీ సీఎంను కలవనున్న నటులు
X
Megastar Chiranjeevi and Nagarjuna

అనుకున్న విధంగానే ఏపీ సీఎం జగన్మోహనరెడ్డిని కలిసేందుకు సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు మిగిలిన బృందం ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. వారు అనుకున్నట్టుగానే కాసేపట్లో జగన్ ను కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్ రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్‌రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. భోజనం చేసి కొంత సేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రిని కలవనుంది.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్‌, తదితర అంశాల గురించి కూడా సీఎం వైఎస్‌ జగన్‌తో వారు చర్చించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.


admin1

admin1

Next Story