లవ్ బ్రేక‌ప్‌పై స్పందించిన ఇలియానా

Ileana D’Cruz,  Andrew Kneebone,
x
Ileana D’Cruz, Andrew Kneebone,
Highlights

గోవా బ్యూటీ ఇలియానా లండన్‌కి చెందిన ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే.

గోవా బ్యూటీ ఇలియానా లండన్‌కి చెందిన ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెలిసిందే. ఆండ్రూను తన భర్తగా కూడా అంటూ సంబోధించింది. అయితే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆన్ ‎‌ఫాలో చేసుకోవడంతో వారి ఇరవురి మధ్య లవ్ బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మొదటిసారి ఇలియానా పెదవి విప్పారు.

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. మా బ్రేకప్ గురించి తాను పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో నాపై ట్రోల్స్ వస్తున్నాయని నేను పెద్దగా పట్టించుకోను. ప్రేమలో విఫలమైనందుకు నేను బాధ పడడంలేదు.. ఇద్దరికి వ్యక్తిగత జీవితాలు ఉంటాయని, ఇద్దరికి సంబంధించిన విషయం. మా ప్రేమ బంధం గురించి ఎవరు మాట్లాడినా పరోక్షంగా వేరే వ్యక్తి గురించి మాట్లాడినట్లు ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే కుటుంబ సభ్యులు స్నేహితుల విలువ అర్థమవుతుంది. నా ప్రేమ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఇలియానా పేర్కొంది. ఇలియానా నటించిన తాజా చిత్రం పాగ‌ల్ పంతీ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories