తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు
Tirumala: విఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్న.. సినీనటుడు మోహన్‌బాబు, మంచు విష్ణు, ఇతర కుటుంబసభ్యులు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోహన్‌బాబు
Tirumala: తిరుమల శ్రీవారిని సినీనటుడు మోహన్ బాబు దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో మంచు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం మోహన్‌బాబుకి వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఏపీ అభివృద్ధిలో ముందుకు సాగాలని స్వామివారిని కోరుకున్నట్లు మోహన్‌బాబు తెలిపారు.