Gunasekhar: ఒక్కడు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన గుణశేఖర్

Gunasekhar: ఒక్కడు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన గుణశేఖర్

Update: 2023-03-29 13:00 GMT

Gunasekhar: ఒక్కడు సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన గుణశేఖర్

Gunasekhar: ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా ఇప్పుడు స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా "శాకుంతలం" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భారతీయ భాషల్లో కూడా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తో చిత్ర బృందం చాలా బిజీగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా జోరుగా పాల్గొంటుంది.

మరోవైపు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ డైరెక్టర్ మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ అయిన "ఒక్కడు" సినిమా గురించి ప్రస్తావన తీసుకువచ్చారు. మహేష్ బాబు "ఒక్కడు" సినిమాకి కూడా స్వయంగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజువలతో గురించి మాట్లాడుతూ గుణశేఖర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. మహేష్ బాబు వంటి స్టార్ వల్లనే ఆ సినిమా పూర్తయిందని అన్నారు గుణ శేఖర్.

అప్పటికి ఇండియాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ పెద్దగా లేదని, బాంబేలో ఎవరో కొంత సీజీ మీద ఆధారపడ్డామన్నారు. టెక్నికల్‌గా ఈ 25 సంవత్సరాల్లో ఎంతో మార్పు వచ్చిందని, చాలా మందికి తెలియన విషయం ఏంటంటే 'ఒక్కడు' సినిమాలో చాలా సీజీ వర్క్ ఉందన్నారు. అది కేవలం విజువల్ ఎన్‌హేన్స్‌మెంట్ వాడామని,. అంత పెద్ద చార్మినార్‌ను నేల మీద వేశామన్నారు. కింద వీధులన్నీ సీజీలో క్రియేట్ చేశామని, మహేష్ బాబు లాంటివాడి సపోర్ట్ ఉండటంతో అది తీయగలిగామన్నారు.

Tags:    

Similar News