The Red Bag Movie: ది రెడ్ బ్యాగ్ ఫస్ట్ లుక్ అదిరింది.. త్వరలో విడుదల!
The Red Bag Movie: విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘ది రెడ్ బ్యాగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో దినేష్ తేజ్ విడుదల చేశారు.
The Red Bag Movie: ది రెడ్ బ్యాగ్ ఫస్ట్ లుక్ అదిరింది.. త్వరలో విడుదల!
The Red Bag Movie: వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ఈ చిత్ర పోస్టర్‌ను యువ హీరో దినేష్ తేజ్, దర్శకుడు హరి ప్రసాద్ కలిసి లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో, రవి కుమార్ శీరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కబీర్ దుహన్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు నిర్మాత తెలిపారు.
ప్రస్తుతం థియేటర్లలో మరియు ఓటీటీల్లో కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్న నేపథ్యంలో, ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. శేఖర్ మోపురి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రియేష్ గురుసామి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు: కబీర్ దుహన్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష తదితరులు.
దర్శకత్వం: రవి కుమార్ శీరపు.
నిర్మాత: హరికృష్ణ సోమిశెట్టి.
సంగీతం: శేఖర్ మోపురి.
పీఆర్వో: సాయి సతీష్.
కెమెరా : ప్రియేష్ గురుసామి
రచన: విక్రమ్ రాజా
ఎడిటింగ్: శివ శర్వాని,శశి
అడిషనల్ డైలాగ్స్: మహమ్మద్ సాయి
లైన్ ప్రొడ్యూసర్: నితిన్ కుమార్ ఆర్
ఫైట్స్: జాషువా, డ్రాగన్ ప్రకాష్
లిరిక్స్: కాసర్ల శ్యాం, తిరుపతి
డాన్స్ మాస్టర్స్: జేడీ, స్నేహ భజంత్రి